ETV Bharat / bharat

'అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు' - సుప్రీంకోర్టు వార్తలు తాజా

హైకోర్టులకు సుప్రీంకోర్టు హితవు పలికింది. అధికారులను ఉన్నపళంగా హాజరుకావాలని పిలిస్తే కోర్టు గౌరవం పెరగదని వ్యాఖ్యానించింది. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవకూడదని పునరుద్ఘాటించింది.

supreme court to high courts, హైకోర్టులకు సుప్రీంకోర్టు
అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదు
author img

By

Published : Jul 10, 2021, 6:46 AM IST

అధికారులను ఉన్నపళంగా తమ ముందు హాజరుకావాలని కొన్ని హైకోర్టులు పిలవడం సరికాదని సుప్రీంకోర్టు వారించింది. ఈ పద్ధతి మానుకోవాలని సూచించింది. అధికారులను పిలిస్తే కోర్టు గౌరవం పెరగదని వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్‌కు సంబంధించిన ఓ కేసులో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

'అధికారులను పిలిపించుకోవడం ద్వారా, కోర్టు అభిరుచులకు తగినట్టు ఆదేశాలు జారీ చేయాలని వారిపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల అధికారాల పరిధిని విభజించే రేఖను మీరినట్టవుతుంది. అధికారులను అప్పటికప్పుడు రమ్మనడం వల్ల వారు ఇతర కార్యక్రమాలను విడిచిపెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఆదేశాల వల్ల కొన్నిసార్లు వారు సుదూర ప్రయాణం చేయాల్సి రావచ్చు. అధికారులను అనవసరంగా కోర్టుకు పిలవకూడదని పునరుద్ఘాటిస్తున్నాం. వారిని తరచూ పిలవడం ప్రశంసనీయం కాదు. ఇది బలమైన పదాలతో ఖండించాల్సిన విషయం' అని జస్టిస్‌ గుప్తా తన తీర్పులో వ్యాఖ్యానించారు.

'న్యాయమూర్తులు తమ పరిధుల్లో ఉంటూ.. అణకువతో, నిగర్వంగా వ్యవహరించాలి. అంతే తప్ప చక్రవర్తుల్లా ప్రవర్తించకూడదు' అని గతంలో అధికారాల విభజన కేసు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలనూ ఉటంకించారు. విధుల్లో కూడా చేరని ఉత్తరాఖండ్‌ అధికారికి సగం జీతం చెల్లించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అనుచితంగా, అన్యాయంగా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులను రద్దు చేసింది.

ఇదీ చదవండి : 'కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు పంతం వీడాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.