ETV Bharat / bharat

High Court: స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టేందుకు హైకోర్టు అనుమతి - Adluri Laxman Latest News

High Court
High Court
author img

By

Published : Apr 19, 2023, 7:51 PM IST

Updated : Apr 19, 2023, 8:51 PM IST

19:37 April 19

మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదం.. హైకోర్టు విచారణ

High Court on Dharmapuri Election Dispute: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. స్ట్రాంగ్ రూమ్‌ సీల్ పగులగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ తెరవాలని ఆదేశించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆర్‌వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇటీవల ధర్మాసనం ఆదేశించింది. తాళంచెవి సరిపోక స్ట్రాంగ్ రూమ్‌ తెరవలేకపోయినట్టు కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు. తాళాల గల్లంతుపై విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.

అసలేం జరిగిదంటే: జగిత్యాల జిల్లాలో 2018 సాధారణ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్ట్రాంగ్ రూం తాళాలను తెరిచేందుకు కలెక్టర్​ను ఆదేశించింది. అయితే ఈ క్రమంలోనే ఈనెల 10న జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా అధికారులతో కలిసి స్ట్రాంగ్ రూం వద్దకు వెళ్లగా తాళం చెవులు కనిపించలేదు. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీనిపై విచారణ జరపాలని హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈసీ విచారణకు గతంలో ఎన్నిక్లలో పాల్గొన్న అధికారులు హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ముగ్గురు అధికారులు హాజరుకాగా.. ఆ రోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏం జరిగింది..? తాళం చెవులు ఎలా మాయమైపోయాయి..? దీనికి బాధ్యులు ఎవరనే కోణంలో విచారణ సాగింది. దీనికి జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్​నగర్​ కలెక్టర్లు షేక్ యాస్మిన్ బాషా, డాక్టర్ శరత్, గుగులోతు రవిలు హాజరయ్యారు. వీరితో పాటు కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. మరో 40 మంది సిబ్బందిని అధికారులు విచారించారు. అనంతరం సేకరించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించనున్నారు.

మరోవైపు ధర్మపురి ఓట్ల రీకౌంటింగ్ జరిపే వరకు తన పోరాటం కొనసాగుతుందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎన్నికల ప్రక్రియ సందర్భంగా జరిగిన అక్రమాలపై పోరాడుతున్నట్లు వివరించారు. తాము కౌంటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా న్యాయ పోరాటం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Adluri Laxman Interview: 'ధర్మపురి ఓట్ల రీకౌంటింగ్ జరగాల్సిందే'

YS Sharmila: 'TSPSC బోర్డు రద్దుకు రాష్ట్రపతికి.. గవర్నర్ సిఫార్సు చేయాలి'

BJP meeting: 'ప్రధాని కావాలని పగటి కలలు కంటూ కేసీఆర్‌ విఫల యాత్రలు చేస్తున్నారు'

'సాయం కోరుతూ అమిత్ షాకు మమత ఫోన్​!'.. రాజీనామా చేస్తానని దీదీ సవాల్

Last Updated : Apr 19, 2023, 8:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.