Heroin Seized In Punjab: పంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్లో వేర్వేరు ఘటనల్లో 40.64 కేజీల మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నాయి సరిహద్దు భద్రతా దళాలు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా 28 ప్యాకెట్ల డ్రగ్స్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. దీని విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు!.
ఓ ఘటనలో బట్టలో చుట్టిన 34.34 కేజీల డ్రగ్స్‌ను గుర్తించాయి భద్రతా దళాలు. మరో ఘటనలో 6.30 కేజీల మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మత్తుపదార్థాలను హెరాయిన్‌గా అనుమానిస్తున్నారు.
పంజాబ్‌లో డ్రగ్స్ సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ సరఫరాపై నిఘా పెంచాయి బలగాలు.
Heroin Seized in indo- pak border: పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో శనివారం భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ రూ. 55 కోట్లు ఉంటుందని తెలిపాయి.
దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 11 ప్యాకెట్ల హెరాయిన్‌ను బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో రూ.72 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్