ETV Bharat / bharat

నిద్రమాత్రలు ఇచ్చి.. భర్తను చికెన్​ బర్నర్​లో కాల్చిన మహిళ - వివాహేతర సంబంధం

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. తన భర్తను దారుణంగా హత్య చేసింది. ఆపై దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు దర్యాప్తులో అసలు విషయం తెలిసింది. కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో ఈ ఘటన వెలుగుచూసింది.

wife killed husband
భర్త దారుణ హత్య
author img

By

Published : Jul 2, 2022, 8:16 PM IST

Updated : Jul 2, 2022, 8:35 PM IST

Wife Killed Husband: ఓ మహిళ తన భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోగానే అతడిని చికెన్​ బర్నర్​పైన కాల్చి చంపింది. ఎనిమిది నెలల క్రితం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర గంజిగుంటె గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులను మెహర్​, తౌసిఫ్​లుగా గుర్తించారు.

ఇదీ జరిగింది..: మెహర్​ గత కొంతకాలంగా తౌసిఫ్​తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే భర్త దాదాపయర్​ తనకు అడ్డుగా ఉన్నాడని భావించిన మెహర్​.. ఓ రోజు అతడికి నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోగానే ప్రియుడి సాయంతో హత్య చేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడంటూ కథ అల్లింది. అయితే ఈ విషయంపై అనుమానం వచ్చిన దాదాపయర్​ సోదరి రేష్మా తాజ్​.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితురాలు మెహర్​ సహా ఆమె ప్రియుడు తౌసిఫ్​లను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : గన్​తో ఆడుతూ ట్రిగ్గర్​ నొక్కిన బాలుడు.. రెండేళ్ల చిన్నారి మృతి

Last Updated : Jul 2, 2022, 8:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.