ETV Bharat / bharat

Helicopter Safe Travel: ఈ రూల్స్​ ఫాలో అయితేనే చాపర్ జర్నీ సేఫ్​!

Helicopter Safe Travel: బుధవారం జరిగిన ఘోర హెలికాప్టర్​ ప్రమాదంలో.. భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో.. అసలు హెలికాప్టర్​లో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాయు రవాణాలో ఎలాంటి నిబంధనలు ఉంటాయి? లోహవిహంగాలు గాల్లోకి ఎగిరేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చూడండి.

Follow these principles for safe travel.
హెలికాప్టర్ ప్రయాణం, Follow these principles for safe travel.
author img

By

Published : Dec 9, 2021, 1:27 PM IST

Helicopter Safe Travel: ఈ ఆధునిక కాలంలో లోహవిహంగాలు లేకుండా దేశ రక్షణని ఊహించలేం. బలగాలు, ఆయుధ, ఆహార సామగ్రి సరఫరాకే కాకుండా.. గస్తీ, శత్రువులపై దాడి, ఎదురుదాడికి ఇవి ఎంతో అవసరం. విమానాలు, హెలికాప్టర్లు అనగానే సాధారణంగా వాయుసేన గుర్తుకువస్తుంది. కానీ సైన్యం, నౌకాదళం వద్ద కూడా వీటి సేవలు ఎంతో కీలకం. ఇందుకోసం ఆయా విభాగాలు ప్రత్యేక వ్యవస్థలను నెలకొల్పాయి. ఇవి ఎంత అవసరమో.. ఏమాత్రం తేడా వచ్చినా అంతే ప్రమాదకరం కూడా. ముఖ్యంగా ఇవి గాల్లోకి ఎగిరేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి సాయుధ బలగాల 'ఆపరేషనల్‌ బేస్‌'లలో కొన్ని సిద్ధాంతాలు బోధిస్తారు. వాటిని నిత్యం మననం చేసుకునేలా ప్రత్యేకంగా రాయించి గోడలకు అతికిస్తారు.

'సువర్ణ సూత్రాలు' పేరుతో రూపొందించిన ఈ నిబంధనలు ప్రమాదరహిత వాయు రవాణాకు ఎంతో కీలకం.

Tezpur Air Force Station

అస్సోంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌బేస్‌లో కనిపించే నిబంధనలు ఇవీ..

1. భౌతికశాస్త్ర నిబంధనల ప్రకారం విహంగాలు ఎగురుతాయి.

2. విహంగాలకు పైలట్ అనుభవం, నైపుణ్యం, విద్యార్హతలు తెలియవు.

3. అద్భుతమైన నైపుణ్యం, నిర్ణయం తీసుకోగలిగే సామర్థ్యాన్ని ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కాకుండా.. ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ఉపయోగించుకోవాలి

4. వాతావరణాన్ని, భౌగోళిక పరిస్థితులను గౌరవించాలి.

5. ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ), ఆదేశాలు, మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి.

6. సమగ్ర సమీక్ష, పునఃసమీక్ష లేకుండా విహంగంతో ఎగిరేందుకు ప్రయత్నించవద్దు.

7. ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలనుకోవడం, ఆత్మసంతృప్తి లేదా అనవసర ప్రయత్నం చేయాలనుకునే ఆలోచనకే తావివ్వొద్దు.

8. అనుమానం ఉంటే ముందుకెళ్లడం కంటే ఆగిపోవడం ఉత్తమం.

9. 'మూడు ఆర్‌'ల సూత్రం గుర్తుంచుకోవాలి. అవి సరైన వ్యక్తి (రైట్‌ పర్సన్‌), సరైన పరికరాలు (రైట్‌ ఎక్విప్‌మెంట్‌), సరైన విధానం (రైట్‌ ప్రొసీజర్‌)

10. వారసత్వంగా వస్తున్న విహంగాల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

Helicopter Crash in Tamil Nadu: యావత్‌ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్‌ రావత్‌ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్‌లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి: ఆర్మీ హెలికాప్టర్​ క్రాష్​.. 1963లోనూ ఇలాగే!

హెలికాప్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం.. దర్యాప్తు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.