బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee News) బరిలో ఉన్న భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గ(Bhabanipur Bypoll) ఉపఎన్నికకు పోలింగ్ గురువారం జరగనుంది. అయితే గతంలో బంగాల్లో ఎన్నికల సమయంలో తలెత్తిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పోలింగ్ నేపథ్యంలో భవానీపుర్(Bhabanipur Bypoll) నియోజకవర్గంలో 15 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు తెలిపారు.
"ప్రతి పోలింగ్ బూత్ లోపల కేంద్ర బలగాలకు చెందిన ముగ్గురు జవాన్లు, పోలింగ్ కేంద్రం బయట రాష్ట్ర పోలీసులు పహారా కాస్తారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదు. రాళ్లు, బాణసంచా, ఇతర పేలుడు పదార్థాలు, ఆయుధాలను వెంట తీసుకెళ్లడంపై నిషేధం విధించాం. ఒక అదనపు పోలీస్ కమిషనర్, నలుగురు జాయింట్ కమిషనర్లు, 14 డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లను భవానీపుర్‌కు పంపించాం. 13 క్విక్ రెస్పాన్స్ బృందాలు, స్టాటిక్ సర్వైలెన్స్ టీం, ఫ్లయింగ్ స్క్వాడ్స్ విధుల్లో ఉంటారు."
-కోల్కతా పోలీసులు
భవానీపుర్(Bhabanipur Bypoll) నుంచి గెలుపొందిన టీఎంసీ నేత సోభందేవ్ ఛటోపాధ్యాయ రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి ఓటమి చవిచూసిన మమతా బెనర్జీ.. ఇప్పుడు ఈ ఉపఎన్నికలో భవానీపుర్ నుంచి పోటీ చేస్తున్నారు. దీదీకి పోటీగా భాజపా నుంచి న్యాయవాది ప్రియాంక టిబ్రివాల్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది.
ఇవీ చూడండి: