ETV Bharat / bharat

ఆ నది ఉగ్రరూపం- 50 ఏళ్లలో తొలిసారి ఇలా... - మధ్యప్రదేశ్​లో సహాయక చర్యలు

మధ్యప్రదేశ్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంబల్​, క్వారీ నదులు ఉప్పొంగి ప్రవాహిస్తుండటం వల్ల పలు గ్రామాలు జలమయమయ్యాయి. 1,200కు పైగా గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

madhyapradesh floods
మధ్యప్రదేశ్​లో వరదలు
author img

By

Published : Aug 4, 2021, 7:33 PM IST

మధ్యప్రదేశ్​లో వరదలు

మధ్యప్రదేశ్​ను భీకర వర్షాల అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి చంబల్​, క్వారీ నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటింది. 1971 తర్వాత క్వారీ నదిలో నీటి మట్టం.. సాధారణ స్థాయి కంటే 10 మీటర్లు ఎక్కువగా ఉండడం ఇదే తొలిసారి. ఈ రెండు నదుల సమీపంలోని వందలాది గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

floods in madhyapradesh
వరదల్లో మధ్యప్రదేశ్​ వాసుల ఇక్కట్లు
rains in madhyapradesh
ఇళ్లను ముంచెత్తిన వరద నీరు
floods in madhyapradesh
మధ్యప్రదేశ్​లో ఉద్ధృతంగా ప్రవాహిస్తున్న నదులు
chambal river in madhyapradesh
మధ్యప్రదేశ్​లో చంబల్​ నది నీటిమట్టం
quarry river in madhyaprdesh
క్వారీ నదిలో పెరిగిన నీటి మట్టం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మురైనా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ఏడుగురిని సైన్యం తమ హెలికాప్టర్ల ద్వారా రక్షించింది. గ్వాలియర్​-చంబల్​ ప్రాంతం, శివ్​పురి, షివోపుర్​ జిల్లాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాతియా జిల్లాలో వరదల ధాటికి ఓ సింధ్​ నదిపై ఉన్న ఓ వంతెన కూలిపోయింది.

సీఎం ఏరియల్​ సర్వే..

మధ్యప్రదేశ్​లో 1,225 గ్రామాలు.. వరదల వల్ల ప్రభావితమయ్యాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​ బుధవారం తెలిపారు. ఆర్మీ, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సాయంతో 5,950 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. 1,950 మంది ఇంకా వరద గుప్పిట్లో చిక్కుకునే ఉన్నారన్న ఆయన.. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్​ సర్వే నిర్వహించారు శివరాజ్​.

floods in madhyapradesh
వరద ప్రభావిత ప్రాంతాల్లో శివరాజ్​ సింగ్ చౌహన్​ ఏరియల్​ సర్వే
mp cm areial survey in flood effected areas
మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ ఏరియల్​ సర్వే
madhyapradesh floods
గ్రామాన్ని ముంచెత్తిన వరదలు- విహంగ వీక్షణం

మోదీ ఫోన్​..

మధ్యప్రదేశ్​లో వరదల పరిస్థితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్​కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: దీదీకి మోదీ ఫోన్​- ఆదుకుంటామని హామీ

ఇదీ చూడండి: వర్షాలకు కూలిన ఇల్లు- ఏడుగురు సజీవ సమాధి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.