బంగాల్, ఉత్తరాఖండ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా సంభవించిన వరదల ధాటికి (Floods in India) అనేక గ్రామాలు, పట్టణాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్తు లేక వేలాది మంది అంధకారంలోకి వెళ్లారు. అనేక చోట్ల వరద నీరు రహదారులపైకి చేరడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద నీటితో పాటు బురద కొట్టుకురావడం వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
చెరువులను తలపిస్తున్న రహదారులు
బంగాల్‌ను వర్షాలు(heavy rains in kolkata) ముంచెత్తుతున్నాయి. వరదలతో(Floods in India) లోతట్టు ప్రాంతాలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కోల్‌కతాలోని లేక్ గార్డెన్లో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాత్కాలిక శిబిరాల్లోకి బురద
ఉత్తరాఖండ్ చమోలి జిల్లా పంగటి గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) కార్మికుల తాత్కాలిక శిబిరాల పైకి బురద నీరు, బండరాళ్లు (heavy rains in Uttarakhand) కొట్టుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ విషయమైన విపత్తు నిర్వహణ అధికారులతో సీఎం పుష్కర్‌సింగ్ ధామి మాట్లాడారు.
బాలుడు గల్లంతు
ఒడిశాను భారీ వర్షాలు(heavy rains in Odisha) అతలాకుతలం చేస్తున్నాయి. భువనేశ్వర్‌లోని డ్రైనేజీలో పడి 15 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సైకిల్‌పై వెళ్తు.. వరదనీటిలో చిక్కుకుని ఆ మైనర్ అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Coronavirus update: దేశంలో మరో 30,256 కరోనా కేసులు