కుండపోత వర్షాలతో కేరళ తడిసిముద్దవుతోంది(kerala floods 2021). భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొండచరియలు విరిగిపడి అనేక రహదారులు మూసుకుపోయాయి. భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది(kerala floods today). రహదారులపై నుంచి భారీగా వరద పారుతోంది. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోగా.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు(kerala floods news 2021). ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
![Heavy rains in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13335958_1.jpg)
భారీ వరదల ధాటికి కోజికోడ్‌లో ఇరువాంజి, చలియార్ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం వరద హెచ్చరిక జారీ చేసింది. పలు ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండడం వల్ల డ్యామ్ గేట్లు ఎత్తి కిందకు నీటిని వదులుతున్నారు. త్రిసూర్, పెరింగల్‌కూతు, షోలయార్, పరంబికుళం డ్యామ్‌ల గేట్లు తెరిచారు. నదులు పూర్తిస్థాయిలో ప్రవహిస్తున్నాయని.. వర్షాలు కొనసాగితే మరిన్ని డ్యామ్‌ల గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు.
మలప్పురం జిల్లాలోని కరిప్పుర్‌లో కుండపోత వర్షాలకు ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మరణించారు. చనిపోయినవారిలో ఆరు నెలల చిన్నారి కూడా ఉందని పోలీసులు తెలిపారు. పక్కనే నిర్మాణంలో ఉన్న భవనం.. చిన్నారులు నివసిస్తున్న ఇంటిపై కూలడం వల్ల ఈ విషాదం జరిగిందని స్థానికులు తెలిపారు.
![Heavy rains in Kerala,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/klc-mpm-10012_12102021075603_1210f_1634005563_266_1210newsroom_1634031909_246.jpg)
![Heavy rains in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13335958_2.jpg)
మరో ఐదు రోజులు...
మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను మోహరించారు.
![Heavy rains in Kerala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13335958_6.jpg)
ఇదీ చూడండి:- షహీన్ తుపాను బీభత్సం- మహానగరం అతలాకుతలం!