తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు(Tamil Nadu rains) రాజధాని చెన్నై సహా పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తూత్తుకూడి, చెంగల్పట్టు, నాగపట్టణంలోని అనేక ప్రాంతాలు నీటి ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో వందకు పైగా సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ముంపు తీవ్రత అధికంగా ఉన్న కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో జాతీయ విపత్తు స్పందన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి. పలు కాలనీల్లో చేరుకున్న వరద నీటిని నీటి ఇంజన్లతో తోడుతున్నారు.
24 గంటల వ్యవధిలో తమిళనాడులో(Tamil Nadu rains update) వరదల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 273 ఇళ్లు దెబ్బతిన్నాయి. చెన్నై తాగునీటి అవసరాలు తీర్చే పూండి సహా పాపనాశం, సతనూరు రిజర్వాయర్ల నుంచి మిగులు జలాలలను కిందకు వదిలారు.
ఇది నాలుగోసారి
చెన్నైలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Tamil Nadu CM Stalin news ) పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు అలుపెరగకుండా సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన ప్రశంసించారు. తమిళనాడులో నవంబరు మాసంలో వంద సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని స్టాలిన్ తెలిపారు. గత రెండువందల సంవత్సరాలలో ఇంత వర్షపాతం నమోదు కావడం ఇది నాలుగోసారి అని వివరించారు.
రెడ్ అలర్ట్
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంత జిల్లాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 29 నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చూడండి: