ETV Bharat / bharat

Rains in Hyderabad : హైదరాబాద్​లో వరుణుడి జోరు.. వీడని వానతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు - People in trouble due to rains in Hyderabad

Heavy Rains in Hyderabad : హైదరాబాద్‌లో వారం రోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో బస్తీలు, కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఓ వైపు వీడని వాన.. మరోవైపు వర్షానికి ఏర్పడుతోన్న సమస్యలు.. జనాలకు తెచ్చిపెడుతోన్న కష్టాలు అన్నీఇన్నీ కావు. మురుగు, వరద చుట్టుముట్టడంతో ముంపు ప్రాంతాల ప్రజల అవస్థలు వర్ణణాతీతం. నగరంలో సగానికి పైగా కాలనీల్లో పైపులైన్ల నుంచి రంగుమారిన మంచి నీరు వస్తోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద కష్టాలతో హైదరాబాద్‌ వాసులు అనుభవిస్తున్న నరకయాతనపై ఇదీ సంగతి ప్రత్యేక కథనం.

Rains in Hyderabad
Rains in Hyderabad
author img

By

Published : Jul 26, 2023, 10:38 PM IST

Updated : Jul 26, 2023, 10:58 PM IST

భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతోన్న భాగ్యనగరం

Hyderabad Rains Today : హైదరాబాద్‌లో వారం రోజులుగా వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని కొన్ని కాలనీలు ఇప్పటికి జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ విభాగం.. ఇలా ప్రతి శాఖకు ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 24 గంటలూ క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నామని సిబ్బంది చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది.

పలు బస్తీలు, కాలనీల్లో విద్యుత్ లేకపోవడం.. మంచి నీరు కలుషితం కావడం సహా అనేక చోట్ల కాలు తీసి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా కుత్బుల్లాపూర్‌లోని పలు కాలనీల్లో మోకాలి లోతు వర్షం నీరు చేరి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పలు డివిజన్లలో వరద నీటితో రోడ్లు దెబ్బతిని గుంతలు గుంతలుగా మారాయి. వోక్షిత్ ఎన్‌క్లేవ్, ఆదర్శనగర్, దేవేందర్‌నగర్, కైసర్‌నగర్, గాజుల రామారంలో ప్రజలు ఇప్పటికి నీళ్లలోనే ఉన్నారు. డ్రైనేజీ మూతలు తెరవడంతో పనులకు వెళ్లేవారు.. పాఠశాలకు వెళ్లే పిల్లలు భయం భయంగా ముందుకు అడుగేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.

People in Trouble Due to Rains in Hyderabad : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ వ్యాప్తంగా మురుగు పొంగి పొర్లుతోంది. 6 రోజుల్లో జలమండలికి మురుగు సమస్యపై 6,000 పైగా ఫిర్యాదులు అందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రతి డివిజన్‌కు 2 ఎయిర్‌టెక్ యంత్రాలు, అత్యవసర వాహనాలు, ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు జలమండలి అధికారులు ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారు. అధిక వర్షాల కారణంగా వస్తోన్న నీరు రంగుమారినా, వాసన వచ్చినా ఆ నీటిని తాగకుండా వెంటనే 155313కు సమాచారం అందించాలని జలమండలి అధికారులు సూచిస్తున్నారు.

Heavy Rains in Hyderabad : వర్షాల కారణంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో రహదారుల నీరు.. బస్తీల్లోని ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనోహర్ థియేటర్, సెకండ్ బజార్లోని డొక్కలమ్మ దేవాలయం, అంబేడ్కర్‌ నగర్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, మారేడుపల్లి లోని ప్రాంతాలలో 4 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలతో భాగ్యనగరంలో విద్యుత్ సరఫరాలోనూ సమస్యలు తలెత్తుతున్నాయి.

"రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. డ్రైనేజీ మూతలు తెరవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొవాలని కోరుతున్నాం." - రాజేశ్వరి, సికింద్రాబాద్

శివార్లలో విద్యుత్‌ వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 50 స్తంభాలు పడిపోగా, మరో 30 వరకు దెబ్బతిన్నాయి. రాజేంద్రనగర్ సర్కిల్లో ఎక్కువగా స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వర్షాలతో విద్యుత్తు వినియోగం కూడా భారీగా పడిపోయింది. 50 మిలియన్ యూనిట్లకు దిగువే ఉంది. మరోవైపు 1912, డయల్ 100, ఇతర కంట్రోల్ రూం నంబర్లు, యాప్‌లలో రోజూ 7,000 దాకా ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిలో అత్యధికం సరఫరాలో అంతరాయాలకు సంబంధించినవే.

Hyderabad Rains : భారీ వర్షాలతో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రధాన రహదారులు అస్తవ్యవస్తంగా మారాయి. చినుకుపడితే చిత్తడిగా మారిపోతున్నాయి. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జిలో వర్షపు వరద నీరు చేరిరాకపోకలు నిలిచిపోయాయి. బీహెచ్‌ఈఎల్, నల్లగండ్ల, మదీనాగూడ, మియాపూర్‌, చందానగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వానలతో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల్లోకి భారీ వరద చేరుతోంది.

Rains in Hyderabad : హైదరాబాద్‌లో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని మేయర్ విజయలక్ష్మి సూచించారు. వర్షంతో సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కంట్రోల్‌ రూం నంబర్లు 9000113667, 040-21111111 లకు ఫోన్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి : Saroornagar Lake Water Issue : సరూర్‌ నగర్‌ చెరువు గేట్లు ఎత్తారు.. ప్రజలు కష్టాల్లో పడ్డారు

Hussain Sagar Water Flood : నిండుకుండలా హుస్సేన్​ సాగర్.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

Last Updated : Jul 26, 2023, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.