దిల్లీలో భారీవర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో దిల్లీలో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేశారు అధికారులు. శనివారం ఉదయానికి సఫ్దార్జంగ్ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఇంకా కొనసాగుతాయన్నారు అధికారులు.
భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్‌పాస్ రోడ్లలో భారీగా నీరు చేరటం వల్ల ఆ మార్గాల్లో రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.
మూల్‌చంద్, ఆజాద్ మార్కెట్, అండర్‌పాస్‌లను తాత్కాలికంగా మూసివేశారు. నోయిడా, ఆజాద్ పుర్ ప్రాంతాల్లో భారీగా వరదనీరు రోడ్లపై ప్రవహిస్తోంది. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అటు ముంబయిలోనూ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. రోడ్లపైకి భారీగా నీరు చేరింది.
ఇదీ చదవండి: కంపించిన భూమి- పరుగులు తీసిన జనం!