ETV Bharat / bharat

కర్ణాటకలో జల విలయం- వరద గుప్పిట్లో ప్రజలు

కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయాలు నిండి పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రహదారులపై నీరు ప్రవహిచండం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీగా వరద నీరులు చేరుతుండటం వల్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

Heavy Rain lashes Karnataka
కర్ణాటకలో జల విలయం
author img

By

Published : Jul 23, 2021, 6:47 PM IST

భారీ వర్షాలకు కర్ణాటక అతలాకుతలం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటం వల్ల నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహాక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు జులై 26 వరకు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

Heavy Rain lashes Karnataka
సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న వరద బాధితులు

ట్రాఫిక్​ అంతరాయం

ఉత్తర కన్నడ జిల్లాలో కారవార, సిర్సీ సహా పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి యల్లాపురం-అంకోలా రహదారి జలమయమైంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పండింది. రహదారి పక్కనే ఉన్న ఓ హోటల్లో 15 మంది సిబ్బందితో పాటు మరో 8మంది చిక్కుకుపోయారు.

Heavy Rain lashes Karnataka
లోతట్టు ప్రాంతాల్లో భారీగా చేరిన వరద నీరు
Heavy Rain lashes Karnataka
నీట మునిగిన ఇల్లు

అంకోలాలో గంగావళి నది వరదల నుంచి తప్పించుకోవడానికి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తుండగా.. పడవ బోల్తా పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అటు వర్షాలకు ఓ గ్రామంలోని 50 ఇళ్లు నీటమునిగాయి.

Heavy Rain lashes Karnataka
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు

సిర్సీలో వాటర్​ ఫాల్స్​ను సందర్శించడానికి వెళ్లిన ఆరుగురు పర్యటకులు గల్లంతయ్యారు. గురువారం నుంచి వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

జలాశయానికి భారీగా వరద నీరు

కేరళ వయనాడ్‌లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మైసూర్​లోని కబిని జలాశయానికి నీటి తాకిడి పెరిగింది. జలాశయం సామర్థ్యానికి మించి నీరు చేరి.. పరిసర గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

Heavy Rain lashes Karnataka
జలాశయాల నుంచి భారీగా ప్రవహిస్తున్న వరద నీరు

పొంగుతున్న వాగులు వంకలు

ధర్వాడా జిల్లాలో భారీవర్షాల ధాటికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని అల్నవర్ తాలుకా శివారులో నాలుగు పశువులు వరదల్లో కొట్టుకుపోయాయి. పంటపొలాలు నీటమునిగాయి.

Heavy Rain lashes Karnataka
ప్రమాదకర స్థాయని మించి ప్రవహిస్తున్న నదులు

బాగల్​కోట్​ జిల్లాలో కృష్ణా నదిలో వరదనీరు చేరుతుండగా.. నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారింది. దీంతో జామకంది తాలుకాలో 30 గ్రామాలు నీటమునిగాయి.

కర్ణాటకలోని ఇంది ప్రాంతం నుంచి మహారాష్ట్రలోని కోల్హాపుర్​కు వెళ్తున్న బస్సు.. బీజాపుర్​ జిల్లాలోని విజయపుర వద్ద కృష్ణా నది వరదల్లో మునిగిపోయింది. సమచారం అందుకున్న ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని.. 19 మంది ప్రయాణికులను రక్షించాయి.

ఇదీ చూడండి: పట్టాలు తప్పిన ఎక్స్​ప్రెస్​ రైలు- భారీ వర్షాలే కారణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.