ETV Bharat / bharat

'వైరస్​ నుంచి కోలుకున్నా.. ఇంటికి వెళ్లను'

కరోనా కారణంగా సొంత కుటుంబసభ్యులే దగ్గరకు రానివ్వని క్రమంలో గుజరాత్​లో కొవిడ్ బాధితురాలికి చికిత్స అందించిన వైద్యురాలు, సిబ్బందికి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. తనను కన్నతల్లికంటే ఎక్కువగా భావించి.. రాత్రింబవళ్లు కంటికి రెప్పలా చూసుకున్న వారిని వదిలి వెళ్లేందుకు ఆ మహిళ నిరాకరించింది. అసుపత్రిలోని సిబ్బంది ప్రోద్బలంతో బరువైన మనసుతో ఇంటికి వెళ్లింది.

author img

By

Published : May 17, 2021, 12:22 PM IST

mother daughter between doctor and patient
ప్రాణదాతకు సలాం

వైరస్ నుంచి కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి.. తనకు మరో జన్మ ఇచ్చిన వైద్యురాలితో పాటు సిబ్బందిని వదిలి వెళ్లాలంటే.. ఆ తల్లికి గుండె భారంగా అనిపించింది. గుజరాత్​ సూరత్​కు చెందిన లతాబెన్​ కొవిడ్​ బారిన పడి సూరత్​లోని మోదీ ఐసోలేషన్ సెంటర్​లో చేరారు. లతాబెన్​కు అన్నీ తామై వైద్య సిబ్బంది.. ఆమెను కంటికిరెప్పలా చూసుకున్నారు. సమయానికి వైద్య సేవలు అందిస్తూ.. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని సమీక్షించారు.

mother daughter between doctor and patient
లతాబెన్​ను ఆలింగనం చేసుకుంటున్న వైద్యురాలు

లతాబెన్​ను ఓదారుస్తున్న వైద్యురాలు

తల్లి కంటే మిన్నగా..

వైద్యుల సహాయంతో మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న లతాబెన్​కు వారిని వదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. తనను కన్నతల్లి కంటే మిన్నగా చూసుకున్న వైద్యురాలిని, సిబ్బందిని వదిలి వెళ్లనని చెప్తుంటే.. అక్కడున్నవారికి ఆనందబాష్పాలు వచ్చాయి.

లతాబెన్​కు మొక్కను బహుకరిస్తూ..

" నాకు ఇక్కడే ఉండాలని ఉంది. అందరూ నాకు ఎంతగానో సేవలు చేశారు. ఇక్కడ ఉంటే ఇంట్లో ఉన్న అనుభుతి కలుగుతుంది" అని లతాబెన్​ చెప్పుకొచ్చింది. వైద్యురాలు డాక్టర్​. పూజాసాహ్ని.. లతాబెన్​ను ఓదార్చి.. ఆమెకు నచ్చజెప్పి..ఓ బేసిల్ మొక్క ఇచ్చి ఇంటికి పంపించారు.

వైద్యురాలిని ఆశీర్వదిస్తున్న లతాబెన్​

వైరస్ బారిన పడి ఐసోలేషన్ సెంటర్​కు వచ్చే బాధితులు.. చిరునవ్వులు చిందిస్తూ వెళ్లేందుకు తాము ఎంతగానో కృషి చేస్తున్నామని డాక్టర్​. పూజాసాహ్ని తెలిపారు.

ఇదీ చదవండి : కొవిడ్​ రిపోర్టు లేక పడక దొరకలేదు.. ప్రాణం ఆగలేదు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.