ETV Bharat / bharat

ఎమ్మెల్సీ కవిత పిటిషన్​పై విచారణ.. మూడు వారాలకు వాయిదా - దిల్లీ మద్యం కుంభకోణం తాజా వార్తలు

Supremecourt on MLC Kavitha Petition : బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఈడీ తనకు ఇచ్చిన సమన్లను సవాల్​ చేస్తూ సుప్రీంలో వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో నేడు విచారణకు వచ్చింది. కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్​పై తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా పడింది.

Supremecourt
Supremecourt
author img

By

Published : Mar 27, 2023, 1:27 PM IST

Updated : Mar 27, 2023, 2:38 PM IST

Supremecourt on MLC Kavitha Petition : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్​ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. కవిత పిటిషన్​పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్​ను గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీం ట్యాగ్‌ చేసింది. ఈడీ ఆఫీస్‌కు మహిళలను పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో న్యాయస్థానంలో నళినీ పిటిషన్‌ వేశారు. ఎమ్మెల్సీ కవిత తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. జస్టిస్​ అజయ్​రస్తోగి, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఈడీ, ఎమ్మెల్సీ కవిత తరఫున వాదనలు విన్నది.

బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆంధ్రప్రదేశ్​కు చెందిన వైఎస్సాఆర్​సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలకు చెందిన బినామీలు అరుణ్‌రామచంద్రపిళ్లై, ప్రేమ్‌ రాహుల్‌లు సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి దిల్లీ లిక్కర్ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారన్నది ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అభియోగం. ఇదే విషయంపై ఈ నెల 11న ఎమ్మెల్సీ కవితను తొలిసారి ఈడీ దాదాపు సుదీర్ఘంగా 8 గంటలపాటు ప్రశ్నించింది. మళ్లీ మార్చి 16న హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. మహిళలను చట్టప్రకారం వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉన్నప్పటికీ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి పిలవడాన్ని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత సవాల్​ చేస్తూ ఈ నెల 14న సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

తాను వేసిన పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు ఈ నెల15న సీజేఐ ధర్మాసనం ముందు లేవనెత్తారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అందుకు తిరస్కరించి ఈ నెల 24న విచారిస్తామని స్పష్టం చేశారు. కానీ అప్పుడు ఈ కేసు విచారణకు రాలేదు. ఈ క్రమంలో ఇవాళ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమె పిటిషన్​పై విచారణను 3 వారాలకు వాయిదా వేస్తూ తీర్పును ఇచ్చింది.

ఈడీ విచారణకు రెండోసారి ఈ నెల 20న హాజరైన ఎమ్మెల్సీ కవితను 10 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. తదుపరి రోజు మార్చి 21న మరోసారి విచారణకు హాజరైన కవితను దాదాపు ఎనిమిదిన్నర గంటల పాటు విచారించారు. మార్చి 21 ఈడీ విచారణకు వెళ్లేముందు కవిత ఈడీ అధికారికి లేఖ రాశారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తునకు సంబంధించి వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 27, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.