కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. దివ్యాంగులకు(Vaccination for differently abled) ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం గురువారం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. రోజువారి కొవిడ్ కేసుల సంఖ్య(Covid cases in india) తగ్గుతున్నప్పటికీ.. కరోనా వ్యాప్తి రెండో దశ ముప్పు కొనసాగుతోందన్న విషయం మరిచిపోవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
గత వారం 63.73 శాతం కేసులు కేరళలోనే(kerala covid 19 cases) నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. లక్షకుపైగా యాక్టివ్ కేసులున్న రాష్ట్రం కేరళ మాత్రమేనని వెల్లడించింది. వారాంతంలో 33 జిల్లాల్లో 10 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్లు స్పష్టం చేసింది.
పండగ వేళల్లో.. 5 శాతం కంటే పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడొద్దని కొవిడ్ నిబంధనల్లో పేర్కొన్నట్లు గుర్తుచేసింది.
84 కోట్లు..
దేశంలో టీకా డోసుల పంపిణీ(Vaccination in India till today) 84 కోట్ల మైలురాయిని దాటిందని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. గురువారం 65,26,432 టీకా డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. దేశంలో 18 ఏళ్లు నిండినవారిలో 66 శాతం మంది కొవిడ్ సింగిల్ డోసు తీసుకున్నారని పేర్కొంది. 23 శాతం మంది రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపింది.
కొత్త వేరియంట్..
ప్రస్తుతం భారత్లో కొవిడ్ కొత్త వేరియంట్(New variant of covid in India) వ్యాపిస్తోందన్న వ్యాఖ్యలకు ఆధారంలేదని జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం- ఇన్సాకాగ్(INSACOG) పేర్కొంది. భారత్లో వ్యాప్తిస్తోంది డెల్టా వేరియంట్ మాత్రమేనని తమ బులిటెన్లో పేర్కొంది. 2021 జూన్ నుంచి ఏవై.1 వేరియంట్ వ్యాప్తి పెరిగినట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏవై.4 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు ఇన్సాకాగ్ వెల్లడించింది. భారత్లో మ్యూ, సీ.1.2 వేరింట్లు కనిపించలేదని గతవారం బులిటెన్లో పేర్కొంది.
కేరళలో కొత్తగా 19,682 కేసులు..
కేరళలో కొత్తగా 19,682 మందికి వైరస్ సోకింది. 152 మంది వైరస్ బలయ్యారు. తాజాగా 20,510 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,60, 046 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదీ చదవండి: