ETV Bharat / bharat

మాజీ సీఎం కుమారస్వామి‌కి కరోనా పాజిటివ్​ - JDS youth wing President Nikhil Kumaraswamy

కరోనా సోకినవారి జాబితాలో మరో ప్రముఖ వ్యక్తి చేరారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్​ అధ్యక్షుడు కుమారస్వామికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కుమారస్వామితో పాటు ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి కూడా వైరస్​  బారినపడ్డారు.

KA Former CM HD Kumara Swamy
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి
author img

By

Published : Apr 17, 2021, 7:36 PM IST

Updated : Apr 17, 2021, 8:01 PM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్​ సెక్యూలర్​(జేడీఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

HD Kumaraswamy tweet
కుమారస్వామి ట్వీట్​

"నాకు కొవిడ్​ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్‌లోకి వెళ్లండి."

- హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం

కొద్దిరోజులుగా.. బసవకళ్యాణ్​ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ సీఎం.. మార్చి 23న కొవిడ్​ టీకా తొలిడోసు వేయించుకున్నారు.

తనయుడికీ పాజిటివ్​..

కుమారస్వామి తనయుడు, జేడీ(ఎస్​) యూత్​ విగ్​ ప్రెసిడెంట్​ నిఖిల్ కుమారస్వామికీ వైరస్​ సోకినట్టు తేలింది. అంతకు కొద్దిరోజుల ముందే.. కుమారస్వామి తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ కూడా మహమ్మారి బారినపడ్డారు.

ఇదీ చదవండి: 'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'

Last Updated : Apr 17, 2021, 8:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.