నందిగ్రామ్‌లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ.. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను కోల్‌కతా హైకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. జూన్ 24న దీనిపై వాదనలు వింటామని తెలిపింది.
మమత పిటిషన్‌పై జస్టిస్ కౌషిక్ చందా ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్ కాపీలను ప్రతివాదులకు సమర్పించాలని మమతా బెనర్జీ తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
ఇటీవల జరిగిన బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గంలో భాజపా నేత సువేందు అధికారి.. అక్రమాలకు పాల్పడ్డారని మమత తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. కౌంటింగ్‌లోనూ అవకతవకలు జరిగాయని తెలిపారు.
స్పీకర్ వద్దకు సువేందు
83-కృష్ణానగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ముకుల్ రాయ్‌ను అనర్హుడిగా గుర్తించాలని కోరుతూ బంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను శుక్రవారం అభ్యర్థించారు. మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన ముకుల్.. టీఎంసీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో దీదీతో రాజకీయపరమైన విబేధాలు రాగా పార్టీకి దూరమై.. భాజపాలో చేరారు. అయితే.. ఇటీవల ఆయన భాజపాను వీడి సొంతగూటికి చేరుకున్నారు.
ఇవీ చూడండి: