ETV Bharat / bharat

జైలులో ఖైదీ హత్యపై హైకోర్టు దిగ్భ్రాంతి - తిహార్​ జైలులో హత్య

జైలు ఆవరణలో ఓ ఖైదీని కత్తులతో పొడిచి హత్య చేయటం షాక్​కు గురిచేసిందని ఆందోళన వ్యక్తం చేసింది దిల్లీ హైకోర్టు. ఇలాంటి ఘటనలు కల్పిత కథల్లోనే చూస్తామని పేర్కొంది. తిహార్​ జైలులో జరిగిన ఘటనపై బాధితుడి తండ్రి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది న్యాయస్థానం. కేసులో పూర్తి వివరాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

HC shocked by murder of undertrial inside prison
జైలులో ఖైదీ హత్యపై దిల్లీ హైకోర్టు దిగ్భ్రాంతి
author img

By

Published : Feb 24, 2021, 5:43 PM IST

తిహార్​ జైలులో ఖైదీని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన షాక్​కు గురిచేసిందని పేర్కొంది దిల్లీ హైకోర్టు. ఇలాంటివి కల్పిత కథల్లోనే జరుగుతాయని తెలిపింది. బాధితుడి తండ్రి రూ.5 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించిన పిటిషన్​ విచారణ సందర్భంగా.. ​' ఇలాంటివి ఎలా జరుగుతాయో నాకైతే తెలియదు. అది నన్ను షాక్​కు గురిచేసింది. ఇలాంటివి కేవలం కల్పిత కథల్లోనే చూస్తాం.' అని జస్టిస్​ ప్రతిభ ఎం సింగ్​ అన్నారు.

జైలు లోపల జరిగిన ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదైందా? లేదా ? ఎఫ్​ఐఆర్​ నమోదైతే దర్యాప్తు స్థితి ఏమిటి? అనే అంశాలపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులు, దిల్లీ ప్రభుత్వ ప్రతినిధి, అదనపు స్టాండింగ్​ కౌన్సెల్​ సంజయ్​ ఘోస్​, న్యాయవాది నమన్​ జైన్​ సహా పోలీసులను ఆదేశించింది దిల్లీ కోర్టు. నివేదికలో.. బాధితుడిని ఉంచిన గది సీసీటీవీ దృశ్యాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏ విధంగా అనేది ఉండాలని స్పష్టం చేసింది. అలాగే.. ఈ ఘటనపై ఏదైనా ఛార్జ్​షీట్​ నమోదైందా? అయితే.. దాని స్థితిని తెలియజేయాలని ఆదేశించింది. వాటితో పాటు.. బాధితుడి తండ్రికి కేసు పురోగతి, దర్యాప్తుపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తెలిపింది.

విచారణ సందర్భంగా.. ఇలాంటివి దేశ రాజధానిలో జరగటం తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయమని పేర్కొన్నారు ఘోస్​. బాధితుడి శరీరంపై తొమ్మిది గాట్లు ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు.. బాధితుడు దిల్​షేర్​ అజాద్​ తండ్రి అలీ షేర్​.. తన కుమారుడు 2019 సెప్టెంబర్​ నుంచి విచారణ ఎదుర్కొంటూ తిహార్​ జైలులో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు. 2020, నవంబర్​ 30న అతడు మరణించినట్లు పోలీసుల నుంచి ఫోన్​ వచ్చిందని, తాను జైలుకు వెళ్లిన క్రమంలో అక్కడి సిబ్బంది తనకు సహకరించలేదని వివరించారు. తన కుమారుడి మృతికి సరైన కారణాన్ని చెప్పలేదని.. న్యాయవాదిని సంప్రదించిన క్రమంలో కత్తిపోట్లతో మరణించినట్లు తెలిసిందన్నారు. పిటిషన్​ దాఖలు చేసిన తర్వాత 2020, డిసెంబర్​ 1న మృతదేహాన్ని అప్పగించారని తెలిపారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషనర్​, దిల్లీ గవర్నర్​, ముఖ్యమంత్రి, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జైళ్ల శాఖ డీజీకి రాతపూర్వక పిటిషన్​ దాఖలు చేసిన ఇప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

వాదనల అనంతరం తదుపరి విచారణను మార్చి​ 5కు వాయిదా వేసింది దిల్లీ హైకోర్టు.

ఇదీ చూడండి: 'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1- చివరకు ట్రంప్​ పరిస్థితే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.