వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో 'చట్టవిరుద్ధంగా' టైమ్స్ ఆఫ్ ఇండియా, నవభారత్ టైమ్స్ ఈ-పేపర్‌లను షేర్ చేయడాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఈ-పేపర్‌లను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం చట్టవిరుద్ధమని, అది కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘిస్తోందన్న బెన్నెట్-కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ వాదనతో సూత్రప్రాయంగా ఏకీభవించింది జస్టిస్ జయంత్ నాథ్ ధర్మాసనం. ఆ సంస్థకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఫొటోలు, డాక్యుమెంట్లు, వీడియోలను గ్రూపులలో షేర్ చేయడంపైనా వివరణ ఇవ్వాల్సిందిగా వాట్సాప్, టెలిగ్రామ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసిన కోర్టు.. దీనిపై స్పందించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి: 'ఈ వ్యాజ్యాన్ని దరఖాస్తుగా పరిగణించండి'