Haryana Robbery News : నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి.. అతడి దగ్గర ఉన్న నగదును దోచుకున్నారు నలుగురు దుండగులు. అనంతరం బాధితుడి జననాంగంపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. ఈ దారుణం హరియాణాలోని గురుగ్రామ్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బిహార్‌కు చెందిన ఓ యువకుడు(32) ఖండ్సా గ్రామంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ప్రెస్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడు ఒంటరిగా తన ఇంటికి నడిచి వెళ్తున్నాడు. అప్పుడు మహ్మద్‌పుర్ రోడ్డులో ముసుగు ధరించిన నలుగురు దుండగులు అతడిపై దాడి చేశారు. డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. అందుకు బాధితుడు నిరాకరించడం వల్ల జేబులో ఉన్న డబ్బులను బలవంతంగా తీసుకున్నారు. వారి చెర నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన బాధితుడిపై దారుణంగా ప్రవర్తించారు. పదునైన కత్తితో బాధితుడి జననాంగంపై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
'కొందరు దుండగులు ముసుగులో వచ్చి డబ్బులివ్వమని నన్ను అడిగారు. అందుకు నేను నిరాకరించాను. వారు నాపై దాడి చేసి.. జేబులో ఉన్న డబ్బుల్ని లాక్కున్నారు. అనంతరం అక్కడి నుంచి నేను పారిపోయేందుకు ప్రయత్నించగా.. నా ప్యాంట్ విప్పి జననాంగంపై దాడి చేశారు. వెంటనే నేను నొప్పితో కేకలు వేశాను. అప్పుడు వారందరూ పారిపోయారు. ఇంటికి వెళ్లి నా సోదరుడికి జరిగిందంతా చెప్పాను. వెంటనే అతడు నన్ను ఆస్పత్రికి తరలించాడు.' అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై సెక్టార్-37 పోలీసులు.. నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు.
వృద్ధ దంపతుల నోటికి టేప్.. ఒకరు మరణం
వృద్ధ దంపతులు ఉన్న ఇంట్లోకి చొరబడి దోపిడికి పాల్పడ్డారు ముగ్గురు దొంగలు. వారు అరవకుండా నోటికి టేప్ వేసి చేతులు కట్టేశారు. ఈ క్రమంలో శ్వాస ఆడక వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబయిలో ఆదివారం జరిగింది.
అసలేం జరిగిందంటే..
దక్షిణ ముంబయిలోని ఓ ఫ్లాట్‌లో మదన్ మోహన్ అగర్వాల్(75), అతడి భార్య సురేఖ(70)తో కలిసి నివసిస్తున్నాడు. వారి ఫ్లాట్‌లోకి ఆదివారం ఉదయం ముగ్గురు దొంగలు ప్రవేశించారు. వృద్ధ దంపతుల నోటికి టేప్ వేసి తాడుతో చేతులను కట్టేశారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, గడియారం, విలువైన సామగ్రిని దోచుకుని పరారయ్యారు. నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మదన్ మోహన్ మెల్లగా ఇంటి తలుపు వద్దకు చేరుకుని అలారం కొట్టాడు. అప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి.. వృద్ధ దంపతులను ఆస్పత్రికి తరలించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సురేఖ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మదన్ మోహన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మదర్సా హాస్టల్ గదిలో 12ఏళ్ల విద్యార్థి దారుణ హత్య.. తల, శరీరం రెండు వేర్వేరుగా..
అంబులెన్స్ ఆలస్యం.. రాజ్‌భవన్ ముందే మహిళ ప్రసవం.. శిశువు మృతి