Haryana Nuh Security : హరియాణాలోని నూహ్‌లో మరోసారి ఉద్రిక్త వాతావారణ నెలకొంది. శోభాయాత్ర చేపట్టేందుకు అధికారులు అనుమతి ఇవ్వనప్పటికీ హిందూసంస్థలు సిద్ధమవుతుండటం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటీవలే అల్లర్లు జరిగిన నూహ్‌లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ముందుజాగ్రత్త చర్యగా స్కూళ్లు, బ్యాంకులు మూసివేశారు. ప్రజలు ఎక్కడా గుమిగూడకుండా 144 సెక్షన్ విధించారు. మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలనూ పూర్తిగా నిలిపివేశారు.
Nuh Yatra Today : అయితే పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారాన్ని (ఉత్తరాది ప్రకారం) పురస్కరించుకుని పలు హిందూ సంస్థలు.. శోభాయాత్రకు పిలుపునిచ్చాయి. సెప్టెంబరు 3వ తేదీ నుంచి 7వే తేదీ వరకు జీ20 షెర్పా గ్రూప్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో శోభాయాత్రకు అనుమతులు ఇవ్వలేమని అధికారులు.. హిందూ సంస్థలకు స్పష్టం చేశారు. అయినప్పటికీ శోభాయాత్రను నిర్వహించి తీరుతామని విశ్వహిందూ పరిషత్ తేల్చి చెప్పింది. దీంతో హరియాణా పోలీసులు అప్రమత్తమయ్యారు.
జిల్లా సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Nuh Section 144 : పక్కా ప్రణాళికతో 30 కంపెనీల పారామిలిటరీ బలగాలను పోలీసులు రంగంలోకి దించారు. జిల్లా సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. తనిఖీలు చేపట్టారు. నూహ్ వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి.. ఎక్కడికక్కడే బారికేడ్లను పెట్టారు. మిగతా జిల్లాల ఎవరికీ నూహ్‌లోకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దూకాణాలు తెరవద్దని స్థానికులకు సూచించారు. అంతే కాకుండా.. సోమవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.
అయోధ్య సాధువుల అడ్డగింత..
Nuh Yatra VHP : మరోవైపు, నూహ్‌లోని నల్హత్ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ పూజల్లో పాల్గొనేందుకు అయోధ్య నుంచి కొంతమంది సాధువులు వచ్చారు. కానీ వారిని సరిహద్దుల్లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. దీంతో సాధువులు రోడ్డుపైనే బైఠాయించారు.
-
#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.
— ANI (@ANI) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
"I have come here from Ayodhya...The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna
">#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.
— ANI (@ANI) August 28, 2023
"I have come here from Ayodhya...The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.
— ANI (@ANI) August 28, 2023
"I have come here from Ayodhya...The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna
'ఆమరణ నిరాాహార దీక్ష చేస్తున్నా'
"నేను అయోధ్య నుంచి ఇక్కడికి వచ్చాను. పోలీసులు మమ్మల్ని ఇక్కడే ఆపారు. ముందుకు వెళ్లనివ్వడం లేదు, వెనక్కు వెళ్లనివ్వడం లేదు. అందుకే నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను" అని జగద్గురువు పరమహంస ఆచార్య మహరాజ్ చెప్పారు.
'ఆలయాల్లో పూజలు చేసుకోండి'
Nuh Violence Haryana News : అయితే భద్రతా కారణాల దృష్ట్యా హిందూ సంస్థల శోభాయాత్రకు తాము అనుమతులు ఇవ్వలేదని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రజలు సమీపంలోని ఆలయాలకు వెళ్లి పూజలు చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు.
Nuh Violence Reason : గత నెల 31వ తేదీన.. నూహ్‌లో జరిగిన ర్యాలీపై కొందరు దుండగులు మూకదాడి జరిపారు. దీంతో ర్యాలీ హింసాత్మకంగా మారాంది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి నూహ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హరియాణాలో టెన్షన్ టెన్షన్.. అనేక కార్లు ధ్వంసం.. కర్ఫ్యూ అమలు
హరియాణాలో ఆగని 'ఆపరేషన్ బుల్డోజర్'.. హోటల్ కూల్చివేత.. అప్పటి వరకు నో ఇంటర్నెట్