కన్నతండ్రే కూతురి పట్ల కిరాతకుడిగా మారాడు! రక్తం పంచుకొని పుట్టిన కూతురని కూడా చూడకుండా పశువాంఛతో విచక్షణ కోల్పోయి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. 17 ఏళ్ల బాలికపై కన్నతండ్రే ఏడేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన హరియాణాలోని హిస్సార్లో వెలుగులోకి వచ్చింది.
ఏడేళ్లుగా..
ఓ ప్రభుత్వ ఉద్యోగి వద్ద వంటమనిషిగా పనిచేస్తున్న తన తండ్రి గత ఏడేళ్లుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని తెలిపింది. పలుమార్లు గర్భం రావడంతో అబార్షన్ చేయించాడని వాపోయింది. ఆ తర్వాత తన అక్క ఇంటికి కొన్నాళ్లపాటు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి తన చెల్లెల్ని వేధించడం ప్రారంభించాడని పేర్కొంది. దీంతో భరించలేని ఆ బాలిక తల్లికి ఈ విషయం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం