ETV Bharat / bharat

హరియాణాలో రైతు నేతపై కాల్పులు - బీకేయూ

హరియాణాలో రైతు నేత జస్​తేజ్​ సింగ్​పై కాల్పులు జరిపారు దుండగులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులను కలవడానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి చేశారు.

Haryana BKU leader Jastej Singh escapes unhurt as bike-borne assailants open fire
హరియాణాలో రైతు నేతపై కాల్పులు
author img

By

Published : Feb 23, 2021, 6:22 AM IST

భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) హరియాణా ప్రధాన కార్యదర్శి జస్​తేజ్ సింగ్ సంధూపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. హరియాణాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి వెళుతున్న సమయంలో సోమవారం ఈ దాడి జరిగింది.

జస్​తేజ్.. హరియాణా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి జస్విందర్ సంధూ పెద్ద కుమారుడు. పెహోవా వద్ద టోల్​ ప్లాజా వైపు వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయన కారును ఓవర్​టేక్​ చేశారు. వారిలో ఒకరు కారు సమీపంలోకి వచ్చి తుపాకీతో కాల్చారు. అదృష్టవశాత్తు డ్రైవర్ సీట్​ విండో నుంచి బుల్లెట్ అవతలి విండోలోకి వెళ్లడం వల్ల జస్​తేజ్ క్షేమంగా బయటపడ్డారు.

అదుపులోకి తీసుకున్న కారును ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.