ETV Bharat / bharat

కీలక వ్యాక్సిన్​ బోర్డుకు హర్షవర్ధన్​ ఎంపిక

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్​ బోర్డ్ ఆఫ్​ గ్లోబల్​ అలియాన్స్​ ఫర్​ వ్యాక్సిన్స్​ అండ్​ ఇమ్యూనైజేషన్(జీఏవీఐ)లో సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. జీఏవీఐ బోర్డులో తూర్పు-దక్షిణ ప్రాంతీయ విభాగంలో సభ్యుడిగా ప్రాతినిథ్యం వహించనున్నారు.

Harsh Vardhan nominated to Board of Global Alliance for Vaccines and Immunisation
గ్లోబల్​ అలియాన్స్​ ఫర్​ వ్యాక్సిన్స్​ బోర్డుకు హర్షవర్ధన్​ ఎంపిక
author img

By

Published : Dec 29, 2020, 10:58 PM IST

బోర్డ్ ఆఫ్​ గ్లోబల్​ అలియాన్స్​ ఫర్​ వ్యాక్సిన్స్​ అండ్​ ఇమ్యూనైజేషన్(జీఏవీఐ)లో సభ్యులుగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా.హర్షవర్ధన్​ ఎంపికయ్యారు. ఈ బోర్డులో తూర్పు-దక్షిణ ప్రాంతీయ విభాగంలో సభ్యుడుగా ప్రాతినిథ్యం వహించనున్నారు. జనవరి 1 నుంచి వర్ధన్​ బాధ్యతలు తీసుకోనున్నారు. 2023, డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం మయన్మార్​కు చెందిన మియంట్​ హత్​వే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జీఏవీఐ బోర్డు సంవత్సరానికి రెండుసార్లు సమావేశమవుతుంది. మహమ్మారుల నుంచి ప్రజలను రక్షించేందుకు క్షేత్రస్థాయిలో పాలసీలను బోర్డు రూపొందిస్తుంది. అంతేకాక పేదరికంపైనా దృష్టి సారిస్తుంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 822 మిలియన్ల మంది పిల్లలకు వ్యాక్సిన్​ అందించటంలో ప్రధాన పాత్ర పోషించింది. దాదాపు కోటిన్నర చిన్నారుల మరణాలను అరికట్టింది. ప్రస్తుతం జీఏవీఐ బోర్డు ఛైర్మన్​గా డా.గోజి కోంజోవేలా కొనసాగుతున్నారు.

ఇదీ చదవండి : భారత్​లో 19 కొత్త రకం కరోనా కేసుల గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.