బంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బంధోపాధ్యాయ్ విషయంలో మోదీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బంధోపాధ్యాయ్ను మంగళవారం దిల్లీలో రిపోర్ట్ చేయాలని కేంద్రం మరోమారు లేఖ పంపిన నేపథ్యంలో కీలక ఎత్తుగడ వేశారు. సీఎస్‌గా కొనసాగించకుండా పదవీ విరమణ చేయించి.. సీఎంకు ముఖ్య సలహాదారుగా నియమించారు. మంగళవారం నుంచే అది అమలులోకి వస్తుందని, వచ్చే మూడేళ్ల పాటు తనకు సలహాదారుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.
"నార్త్‌బ్లాక్‌లో మంగళవారం రిపోర్ట్ చేయాలని బంధోపాధ్యాయ్ను కేంద్రం కోరింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్‌పై రావాలని ఒక అధికారిపై ఒత్తిడి చేయకూడదు. సీఎస్‌కు కేంద్రం లేఖ పంపింది. అది నా లేఖకు సమాధానం కాదు. ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు. కేంద్రం నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం. మేము ఆయన్ను రిలీవ్ చేయటం లేదు. ఈరోజే పదవీ విరమణ పొందుతారు. కానీ, వచ్చే మూడేళ్ల పాటు సీఎంకు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
అంతకు ముందు బంధోపాధ్యాయ్ విషయంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు దీదీ. ఆలాపన్‌ను తాము రిలీజ్ చేయలేమని పేర్కొన్నారు.
కొత్త సీఎస్‌గా.. హరే క్రిష్ణ
బంధోపాధ్యాయ్ స్థానంలో హరే క్రిష్ణ ద్వివేదిని కొత్త సీఎస్‌గా నియమించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలాగే.. బీపీ గోపాలికను హోంశాఖ సెక్రెటరీగా నియమిస్తున్నట్లు చెప్పారు.
షోకాజ్ నోటీసులు..
ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. దిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సోమవారం రిపోర్ట్ చేయకపోవటంపై బంగాల్ సీఎస్ ఆలాపన్ బంధోపాధ్యాయ్కు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అందుకు గల కారణాలను వివరించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: 'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'