Hardik Patel Joins BJP: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చిన పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్.. భాజపాలో చేరారు. పార్టీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో గాంధీనగర్‌లోని భాజపా ప్రధాన కార్యాలయంలో గురువారం.. పటేల్ కాషాయ కండువా కప్పుకున్నారు. అంతకుముందు కమలం పార్టీలో తన చేరికపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హార్దిక్.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక చిన్న సైనికుడిగా సేవ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరే ముందు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పటేల్.
![Hardik Patel joins BJP, says will be a soldier under Modi's leadership](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15452416_patel-bjp.jpg)
''ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి గర్వకారణం. భాజపాలో చేరిన తర్వాత.. ప్రతి 10 రోజులకు ఓసారి కార్యక్రమం నిర్వహిస్తా. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు, ఎమ్మెల్యేలను భాజపాలో చేరాలని అడుగుతా. గుజరాత్లో కాంగ్రెస్ లేకుండా చేస్తా.''
- హార్దిక్ పటేల్
![Hardik Patel joins BJP, says will be a soldier under Modi's leadership](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15452416_hardik.jpg)
పాటిదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర యూనిట్లో కీలక స్థానంలో ఉంటూ వచ్చిన పటేల్.. ఇటీవల పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మే 19న కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. అంతా ఊహించినట్లే తాజాగా భారతీయ జనతా పార్టీలో చేరారు.
![Hardik Patel joins BJP, says will be a soldier under Modi's leadership](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15452416_hardik-patel.jpg)
ఇవీ చూడండి: కాంగ్రెస్‌కు హార్దిక్ గుడ్‌బై- వారిపై 'చికెన్ సాండ్విచ్' పంచ్
సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు.. కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం
'కాంగ్రెస్ నా ట్రాక్ రికార్డ్‌ను దెబ్బతీసింది.. అందుకే వారితో పనిచేయను'