Hailstorm in Meghalaya: ఈశాన్య రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్‌గా పిలిచే మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నగరం మంచు దుప్పటిలో కనువిందు చేస్తోంది. ఊహించని విధంగా బుధవారం వడగండ్ల వాన షిల్లాంగ్‌ను కమ్మేసింది. నగరాన్ని తెల్లటి వర్ణంలోకి మార్చేసింది. ఈ ప్రాంతంలో శీతాకాలంలో ఇలా వడగండ్ల వాన కురవటం చాలా అరుదని భారత వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన దశాబ్దంలో 3-4 సార్లు మాత్రమే ఇలా జరిగినట్లు పేర్కొంది.
వడగండ్లతో కూడిన హిమపాతంతో.. ఎగువ షిల్లాంగ్, లైత్కోర్ ప్రాంతాలు శ్వేతవర్ణాన్ని సంతరించుకున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించే వారికి గొప్ప అనుభూతిని పంచుతున్నాయి. మంచులో కేరింతలు కొడుతూ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలను షేర్ చేయటంలో బిజీగా మారిపోయారు అక్కడి ప్రజలు.
ఇదీ చూడండి: శ్వేతవర్ణంలో 'హిమాచల్' అందాలు.. పర్యటకులకు కనువిందు