ETV Bharat / bharat

ఏడాదికి 22 కోట్ల కొవాగ్జిన్​ డోసులు: హాఫ్కిన్​ - హాఫ్​కిన్​ బయోఫార్మా

మరో 8 నెలల్లో హాఫ్కిన్​ బయోఫార్మా కార్పొరేషన్.. కొవాగ్జిన్​ టీకా​ ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ వెల్లడించింది. ఉత్పత్తి ప్రారంభమయితే ఏడాదికి 22 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.

haffkine covaxin, హాఫ్​కిన్​ బయోఫార్మా
కొవాగ్జిన్​ను ఉత్పత్తి చేయనున్న హాఫ్​కిన్​
author img

By

Published : Jun 2, 2021, 10:15 AM IST

కొవాగ్జిన్​ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హాఫ్కిన్​ బయోఫార్మా కార్పొరేషన్ లిమిటెడ్​ (హెచ్​బీపీసీఎల్​) సంస్థ సిద్ధమైంది. అవసరమైన ఏర్పాట్లు పూర్తవ్వగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని.. అందుకు ఎనిమిది నెలలు పడుతుందని సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏడాదికి 22 కోట్ల డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇటీవల హెచ్​బీపీసీఎల్​కు అనుమతి కూడా లభించింది.

"భారత్​ బయోటెక్​ నుంచి టెక్నాలజీ ట్రాన్సఫర్​ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నాం. ఉత్పత్తికి తగిన ఏర్పాట్లు పూర్తికావడానికి 8 నెలలు పడుతుంది. ఉత్పత్తి ప్రారంభమయితే నెలకు దాదాపు 2 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తాం."

-సందీప్​ రాఠోడ్​, హెచ్​బీపీసీఎల్​ ఎండీ

వ్యాక్సిన్​ ఉత్పత్తి నిమిత్తం కేంద్రం రూ.65 కోట్లు, వసతుల ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.93 కోట్లు మంజూరు చేసిందని హెచ్​బీపీసీఎల్​ వెల్లడించింది.

ఇదీ చదవండి : అతిత్వరలో భారత్​కు 'స్పుత్నిక్ లైట్' టీకా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.