ఏడాది క్రితం హస్తంను వీడి భారతీయ జనతా పార్టీ గూటికి చేరిన జ్యోతిరాదిత్య సింధియాను ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధియా కాంగ్రెస్‌లో ఉండి ఉంటే ఎప్పటికైనా ముఖ్యమంత్రి అయ్యేవారని అన్నారు.
అయితే.. భాజపాలోకి వెళ్లి ఆ పార్టీలో సింధియా చివరి వ్యక్తి(బ్యాక్ బెంచర్)గా నిలిచారని ఎద్దేవా చేశారు రాహుల్. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ యువజన సమావేశంలో పాల్గొన్న రాహుల్.. ఈ వ్యాఖ్యలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎప్పటికైనా ముఖ్యమంత్రివి అవుతావని సింధియాకు చెప్పిన విషయాన్ని రాహుల్ గుర్తు చేశారని పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: మిథున్ 'చక్రం'.. భాజపా కొత్త అస్త్రం!