కరోనా సమయంలో కేంద్రం తన బాధ్యతలను సరిగా నిర్వర్తించి ఉంటే విదేశాల నుంచి భారత్ సాయం పొందే అవసరం వచ్చేది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విదేశాల నుంచి సాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని ట్వీట్ చేశారు.
-
विदेशी सहारा पाने पर केंद्र सरकार का बार-बार छाती ठोकना निराशाजनक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
अगर मोदी सरकार ने अपना काम किया होता, तो ये नौबत ना आती।
">विदेशी सहारा पाने पर केंद्र सरकार का बार-बार छाती ठोकना निराशाजनक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2021
अगर मोदी सरकार ने अपना काम किया होता, तो ये नौबत ना आती।विदेशी सहारा पाने पर केंद्र सरकार का बार-बार छाती ठोकना निराशाजनक है।
— Rahul Gandhi (@RahulGandhi) May 10, 2021
अगर मोदी सरकार ने अपना काम किया होता, तो ये नौबत ना आती।
"విదేశాల సాయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకోవడం బాధాకరం. ప్రభుత్వం తన బాధ్యతను సరిగా నిర్వర్తించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు.
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
వివిధ దేశాల నుంచి అందుతున్న సాయంపై కేంద్రం పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సహాయక సామగ్రి వివరాలను వెల్లడించాలని కోరుతోంది.
కరోనాపై పోరు సాగిస్తున్న భారత్‌కు వివిధ దేశాల నుంచి విశేష సాయం లభిస్తోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఐర్లాండ్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, కువైట్ దేశాలు వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించాయి.
ఇదీ చదవండి: బ్లాక్ ఫంగస్‌పై జాగ్రత్త సుమా!