ETV Bharat / bharat

ఎన్నికల ముందు కలకలం.. అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​!

అసెంబ్లీ ఎన్నికల ముందు (UP Election 2022) హ్యాకర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ అధికారిక వెబ్​సైట్​నే హ్యాక్​ చేసి.. అభ్యంతరకర పోస్ట్​లు పెట్టారు. నిందితులను పట్టుకొనే పనిలో ఉన్నారు పోలీసులు.

Hackers targets UP assembly website
ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​
author img

By

Published : Sep 9, 2021, 2:03 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ అధికారిక వెబ్​సైట్​.. హ్యాక్​ అయింది. 2022లో శాసనసభ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న వేళ.. ఈ హ్యాకింగ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వెబ్​సైట్​ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. అందులో అభ్యంతరకర కంటెంట్​ను పోస్ట్​ చేశారు. బుధవారం ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్తర్​ప్రదేశ్​ డెవలప్​మెంట్​ సిస్టమ్స్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ (డీఈఎస్​సీఓ).. లఖ్​నవూలోని సైబర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

దీనిపై.. ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకొని.. కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు సైబర్​ క్రైం ఏడీజీ రామ్​ కుమార్​.

''www.upvidhansabhaproceedings.gov.in అనే ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ సచివాలయం అధికారిక వెబ్​సైట్​ హ్యాక్​ అయింది. ఇంకా ఆ వెబ్​సైట్​లో అభ్యంతరకర పోస్ట్​లు పెట్టారు.''

- రామశంకర్​ సింగ్​, యూపీ డీఈఎస్​సీఓ అసిస్టెంట్​ మేనేజర్​

పుణెకు చెందిన టెక్​ సర్వీస్​ కంపెనీ పర్సిస్టెంట్​ లిమిటెడ్​.. ఈ వెబ్​సైట్​ను నిర్వహిస్తోంది.

ఇటీవల.. ఈసీ(ఎన్నికల సంఘం) వెబ్​సైట్​ను హ్యాక్​ చేసి, వందలకొద్దీ నకిలీ ఓటర్​ ఐడీలను సృష్టించిన 24 ఏళ్ల వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. కొద్దిరోజులకే మళ్లీ అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​ కావడం గమనార్హం.

ఇవీ చదవండి: ఉద్యోగంలో గ్యాప్​ వచ్చిందా.. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ మీకోసమే!

ఇండియన్​ ఆర్మీపై ఫేక్ వెబ్​సైట్- వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.