హరియాణా మనేసర్ జిల్లాలో అర్ధరాత్రి పూట కాల్పుల మోత మోగింది. కాసన్ గ్రామంలోని ఓ కుటుంబంపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
![firing in haryana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13549018_firing.jpg)
![firing in haryana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13549018_fir.jpg)
కాల్పుల సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు పటౌదీ ఏసీపీ వీర్ సింగ్ తెలిపారు. పాత కక్షలతోనే దుండగలు కాల్పులకు తీవ్రంగా తెగబడినట్లు చెప్పారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని పేర్కొన్నారు.