గుజరాత్‌కు చెందిన ఓ జానపద గాయని కరెన్సీ నోట్లలో(Currency notes showered) మునిగిపోయింది. స్టేజి మీద ఆమె పాడుతున్నంతసేపు అభిమానులు ఆమెపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూనే ఉన్నారు. బకెట్లతో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించారు. దీంతో ఆ వేదిక మొత్తం నోట్లతో నిండిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ అభిమానాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనేక మంది ఆ వీడియోను లైక్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
గుజరాత్‌కు చెందిన శ్రీ సమస్త్ హరిద్వార్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. సంగీత కచేరీ చేసేందుకు జానపద గాయని రాధాదియాను ఆహ్వానించారు. తన బృందంతో గాయని పాటలు పాడుతున్నంతసేపు స్టేజి మీద ఉన్న సంఘం సభ్యులు, కింద ఉన్న ప్రేక్షకులు ఆమెపై కరెన్సీ నోట్లు(Currency shower) వెదజల్లారు. బకెట్లలో డబ్బులు తీసుకొచ్చి ఆమెపై కుమ్మరించాడు. దీంతో ఆ స్టేజిపై కుప్పల కొద్దీ కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు గాయని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకొని అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఇది వెలకట్టలేని ప్రేమ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటికే లక్షల మంది వీక్షించగా.. వేల మంది లైక్ చేశారు. ఆమె గాత్రం అద్భుతంగా ఉంటుందని మరికొందరి కామెంట్ చేశారు.
ఇదీ చూడండి: 21 రకాల 10 రూపాయల నాణేలతో యువకుడి రికార్డు