ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే ఘటన గుజరాత్‌లోని వడోదరలో జరిగింది. తన దగ్గర విద్యను నేర్చుకోవడానికి వచ్చిన ఓ విద్యార్థిని(15) పట్ల ఓ ట్యూషన్ టీచర్ అనుచితంగా ప్రవర్తించాడు. ట్యూషన్ అయిపోయాక ఆమెతో బలవంతంగా మద్యం తాగించాడు. వెంటనే విద్యార్థిని ఆరోగ్యం క్షీణించింది. దీంతో భయపడి ఆమెను తన ఇంటి వద్ద కారులో దించేశాడు.
ఇంటికి వచ్చిన కుమార్తె పరిస్థితిని చూసి ఆమె తల్లి షాకైంది. ఏం జరిగిందో అడిగింది. వెంటనే జరిగిన విషయాన్ని బాధితురాలు.. తల్లికి చెప్పింది. అనంతరం విద్యార్థిని కుటుంబసభ్యులు.. ఫతేగంజ్ పోలీసుస్టేషన్లో ట్యూషన్ టీచర్‌పై ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ట్యూషన్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇవీ చదవండి: ఈ నెల 18 వరకు జైల్లోనే పార్థా చటర్జీ, అర్పిత.. మోదీని కలిసిన మమత
హెచ్ఐవీ రక్తాన్ని శరీరంలోకి ఎక్కించుకున్న యువతి.. ఎందుకో తెలిస్తే షాక్!