ETV Bharat / bharat

పాతిపెట్టిన ఏడాదిన్నర చిన్నారి డెడ్​బాడీ వెలికితీసి రేప్.. ప్రేయసిని ఇంటికి పిలిచి హత్య - మహారాష్ట్రలో ప్రియురాలిని చంపిన యువకుడు

ఖననం చేసిన ఏడాదిన్నర చిన్నారి మృతదేహాన్ని బయటకు తీసి అత్యాచారం చేశారు కొందరు కిరాతకులు! గుజరాత్​లోని సురేంద్రనగర్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రియురాలిని పొడిచి చంపాడు ఓ వ్యక్తి.

Gujarat Maharashtra Crime News
గుజరాత్​ మహారాష్ట్ర క్రైమ్​ వార్తలు
author img

By

Published : Feb 27, 2023, 11:08 PM IST

గుజరాత్​లోని సురేంద్రనగర్​ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. గుండెలో రంధ్రం కారణంగా చనిపోయన ఏడాది వయసున్న చిన్నారిపై అత్యాచారం జరిగింది! ఖననం చేసిన మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు బయటకు తీసి ఈ దారుణానికి తెగబడ్డట్టు తెలుస్తోంది. ఛిద్రమైన స్థితిలో బాలిక మృతదేహం బయట లభ్యమైంది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏమైందంటే?
సురేంద్రనగర్​ జిల్లా థాన్​ ప్రాంతానికి చెందిన ఏడాదిన్నర బాలికకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. దీంతో ఈ నెల 25న ఆమెకు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. అయినా బాలిక మరణించింది. ఈ క్రమంలో బాలికకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, ఆ తర్వాత బాలిక మృతదేహం ఓ ప్రాంతంలో కనిపించింది. శరీరంపై గాయాలతో పూర్తిగా ఛిద్రమైన స్థితిలో మృతదేహం బయటపడింది.

చిన్నారి మృతదేహాన్ని ఎవరో బయటకు తీసి అత్యాచారం చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం ముందుగా సురేంద్రనగర్​ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం రాజ్​కోట్​లోని సివిల్​ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ప్రైవేటు భాగాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే, ఫోరెన్సిక్​ నివేదిక​ వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీస్​ అధికారి తెలిపారు. అనంతరం బంధువులు బాలికకు మళ్లీ అంత్యక్రియలు నిర్వహించారు.

మహారాష్ట్ర సతారాలో ఓ వ్యక్తి తన ప్రేయసిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. వంజోలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. యువతీ యువకులు ఇద్దరూ గతంలో ప్రేమలో ఉన్నారు. యువతిని వివాహం చేసుకోవాలని అతడు భావించాడు. అయితే, రెండు నెలల క్రితం ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయంపై కోపం పెంచుకున్న యువకుడు.. యువతి తన తల్లి ఇంటికి వచ్చిన సమయంలో హత్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి రావాలని పిలిచి.. పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. స్థానికులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఔంధ్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని, విచారణ జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ ఇన్​స్పెక్టర్ దత్తాత్రేయ దారడే వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.