గుజరాత్‌లోని పెద్ద నగరాల్లో ఒకటైన సూరత్‌లో వ్యర్థాలతో నిర్మించిన శిల్పాలను భారీగా ఏర్పాటు చేశారు. ఇనుము, పారేసిన ప్లాస్టిక్, ఇతర పనికిరాని వస్తువులతో కళాకారులు, యువతను భాగస్వామ్యం చేసి మొత్తం 58 విగ్రహాలను సూరత్ నగర పాలక సంస్థ తయారు చేయించింది. సూరత్‌లో ఆయా ప్రాంతాలకు ఉన్న విశిష్ఠతలు, అక్కడ ప్రజల జీవన శైలిని బట్టి శిల్పాలు ఏర్పాటు చేశారు.
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-6.jpg)
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మ్యూజియం వద్ద గుర్రం సహా వివిధ ఆకారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. సామాజిక సందేశాలను ఇచ్చేలా శిల్పాలను తయారు చేయించినట్లు సూరత్ నగర పాలక సంస్థ కమిషనర్ బంచానిధి పాణి వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో భారీ రాక్షసుడి రూపాన్ని తయారు చేయించిన కమిషనర్.. బీచ్‌లు, పబ్లిక్ ప్రదేశాల్లో పాస్టిక్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను రాక్షసుడి రూపం ప్రతిబింబిస్తున్నట్లు తెలిపారు. సూరత్‌లోని డ్యుమస్ ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే ప్లాస్టిక్ రాక్షసుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. డ్యుమస్‌లో సేకరించిన ప్లాస్టిక్ బాటిళ్లనే విగ్రహంలో ఎక్కువగా ఉపయోగించినట్లు కమిషనర్ వెల్లడించారు.
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-2.jpg)
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-7.jpg)
40 కేజీల వ్యర్థ ఇనుమును ఉపయోగించి తయారు చేసిన సింహం విగ్రహం... మరింతగా ఆకట్టుకుంటోంది. సింహం గర్జిస్తున్నట్లుగా రూపొందించిన శిల్పాన్ని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేశారు.
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-3.jpg)
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-1.jpg)
రీసైక్లింగ్, మొక్కల పెంపకం, స్వచ్ఛ భారత్, భేటీ బచావో- భేటీ పడావో వంటి సందేశాలను చాటేలా కూడా విగ్రహాలు తయారు చేయించినట్లు కమిషనర్ వెల్లడించారు.
![gujarat Surat Sculptures](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12709594_vlcsnap-2021-08-08-12h33m58s839-4.jpg)
ఇదీ చదవండి: కన్నబిడ్డనే బస్సు కిందకు తోసేసిన తల్లి.. చివరకు...