ETV Bharat / bharat

పుట్టింటికి వెళ్లిందని భార్యపై ఆత్మాహుతి దాడి.. - గుజరాత్​ వార్తలు

Gujarat Suicide Blast: గుజరాత్​లోని ఛప్రా గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. భార్య పుట్టింటికి వెళ్లిందన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరూ మృతిచెందారు.

gujarat
పేలుడు
author img

By

Published : Feb 25, 2022, 10:01 PM IST

Gujarat Suicide Blast: భార్యపై కోపంతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటనలో నిందితుడు, అతని భార్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్​లోని ఆరవల్లి జిల్లా బీటీ ఛప్రా గ్రామంలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం..

ములోజ్​ గ్రామానికి చెందిన నిందితుడు లాలా పాగీ (47), శారదాబెన్​కు (43) ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. నిందితుడు తరచూ భార్యను వేధిస్తుండేవాడు. సుమారు నెల రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ జరగడం వల్ల శారదా​ ఆమె పుట్టింటికి వచ్చేసింది. దీంతో కోపం పట్టలేక నిందితుడు ఆమెను హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో శరీరానికి పేలుడు పదార్థాలు చుట్టుకుని గురువారం రాత్రి ఆమె​ ఉంటున్న బీటీ ఛప్రా గ్రామానికి వచ్చాడు. శారదాబెన్​ ఇంటి నుంచి​ బయటకి రాగానే ఆమెను దగ్గరకులాగి డిటోనేటర్​ నొక్కి పేల్చేసుకున్నాడు. పేలుడు ధాటికి ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు.

నిందితుడు జిలెటిన్​ స్టిక్స్​ను వాడాడని పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. పేలుడు పదార్థాలు నిందితుడికి ఎవరు అందించారనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదీ చూడండి : అక్కడ మందు బాటిల్ పెట్టుకుని సైకిల్ సవారీ- క్షణాల్లోనే యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.