ETV Bharat / bharat

మోర్బీ 'సాహస వీరుడు' కాంతిలాల్​ ఘనవిజయం.. నదిలో దూకి మరీ కాపాడినందుకు గిఫ్ట్​! - మోర్బీ ఎమ్మెల్యే కాంతిలాల్​

గుజరాత్​.. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కాపాడిన భాజపా మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్​ అమృతియా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 62వేలకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు, ఆమ్​ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్​ గఢ్వీ ఓటమి పాలయ్యారు.

gujarat-polls 2022-results-kantilal-amrutiya-won in morbi

author img

By

Published : Dec 8, 2022, 4:23 PM IST

Gujarat Elections 2022 Morbi: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మోర్బీ వంతెన కూలిన ఘటనలో అనేక మంది ప్రాణాలు కాపాడిన కాంతిలాల్​ అమృతియా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ప్రతిపక్ష కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి జయంతిలాల్​ పటేల్​పై 62,079 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

మోర్బీ ఘటన అనంతరం భాజపాపై అనేక విమర్శలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం చూపుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ భాజపా.. సిట్టింగ్​ ఎమ్మెల్యే బ్రిజేష్​ మెర్జాకు భాజపా షాక్ ఇచ్చి వంతెన ప్రమాదంలో నదిలో దూకి మరీ ప్రజలను కాపాడిన కాంతిలాల్​ను ప్రశంసిస్తూ ఎమ్మెల్యే టికెట్​ ఇచ్చింది. గురువారం జరిగిన కౌంటింగ్​లో ఆయన భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.
ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంతిలాల్.. ఇప్పుడు మరోసారి విజయం సాధించారు. 1995, 1998, 2002, 2007, 2012లో భాజపా తరఫునే ఆయన శాసనసనభకు ఎన్నికయ్యారు.

ఓటమి చవిచూసిన ఆప్​ సీఎం అభ్యర్థి
గుజరాత్​లో ఆమ్​ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్​ గఢ్వీ ఓటమి చవిచూశారు. ఖాంభాలియా స్థానం నుంచి పోటీ చేసిన ఆయన.. 18,000 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. భాజపా అభ్యర్థి ములుభాయ్​ బేరా అక్కడ విజయం సాధించారు.
ఓట్ల లెక్కింపు సమయంలో తొలి నాలుగు రౌండ్లలో గఢ్వీ ఆధిక్యం కనబరిచారు. కానీ తర్వాత రౌండ్లలో వెనుకంజ వేశారు. చివరకు ఓడిపోయారు.

ఆమ్​ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్​ గధ్వీ
ఆమ్​ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్​ గఢ్వీ

గెలుపొందిన అత్యంత సంపన్న అభ్యర్థి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంపన్న అభ్యర్థి అయిన భాజపాకు చెందిన జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ గెలుపొందారు. మాన్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్​ అభ్యర్థి మోహన్​ సిన్హా థకోర్​పై 30వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం జయంతి భాయ్​ ఆస్తుల విలువ రూ.661 కోట్లు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.