ETV Bharat / bharat

గుజరాత్​ తీరంలో భారత జాలర్లను అపహరించిన పాక్​ - గుజరాత్​ ఓఖా పోర్టు

Pakistan Abduct Fisherman: చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లు పాకిస్థాన్​ చెరలో చిక్కుకున్నారు. ఇంజిన్​ సమస్యతో సముద్రంలో చిక్కుకున్న ఆ బోటును పాక్​కు చెందిన పలువురు హైజాక్​ చేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ​

Pakistan Abduct Fisherman
జాలర్లను అపహరించిన పాక్
author img

By

Published : Jan 29, 2022, 12:57 PM IST

Pakistan Abduct Fisherman: పాకిస్థాన్​ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. చేపల వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు జాలర్లను అపహరించింది. గుజరాత్​లోని ఓఖా తీరం వద్ద ఈ ఘటన జరిగింది. తమ చెరలో ఉన్న 20 మంది భారత జాలర్లను విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.

ఇదీ జరిగింది..

ఓఖా పోర్టు నుంచి ఈనెల 18న తులసీ మైయా అనే బోటులో ఏడుగురు జాలర్లు చేపల వేటకు బయలుదేరారు. కొద్ది రోజులకు ఆ బోటు ఇంజిన్​ పాడవడం వల్ల జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. ఈ సమయంలో శుక్రవారం పాకిస్థాన్​కు చెందిన అధికారులు బోటును హైజాక్​ చేశారు.

ఈ బోటు.. మన్​గ్రోల్​ ప్రాంతానికి చెందిన వత్సల్​ ప్రేమ్​జీభాయ్​ తపానియా అనే వ్యక్తిది అని అధికారులు వెల్లడించారు. చేపల వేట కోసం ఆ బోటును ఓఖా తీసుకువచ్చారని.. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సముద్రంలో చిక్కుకున్న ఆ బోటు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. చివరగా ఆ బోటు యజమాని, జాలర్లతో మాట్లాడామని.. పాకిస్థాన్​ వైపుగా బోటు వెళ్తున్నట్లు వారు వెల్లడించారు పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్​ ఉచితం!

ఇదీ చూడండి : చిన్నవయసులోనే సరిహద్దు దాటి.. హిందువునంటూ 15 ఏళ్లుగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.