ETV Bharat / bharat

పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన 'భార్య' బాధితుడు - భర్తను వేధించిన భార్య

భార్య వేధింపులు తట్టుకోలేక ఓ వివాహితుడు ఏకంగా పోలీస్​ స్టేషన్​కే నిప్పు అంటించాడు. 'నన్ను అరెస్ట్​ చేసి జీవితాంతం జైలులో పెట్టండి' అంటూ స్టేషన్​ ఎదుటే నిల్చున్నాడు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Man troubled by wife set fire to police station
పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన 'భార్య' బాధితుడు
author img

By

Published : Aug 30, 2021, 7:51 PM IST

Updated : Aug 30, 2021, 9:37 PM IST

పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన 'భార్య' బాధితుడు

పెళ్లి అంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటారు. కానీ ఓ వివాహితుడికి మాత్రం 'వందేళ్ల మంట'గా అనిపించింది. దానికి కారణం అతను ఇష్టపడి చేసుకున్న భార్యే! ఆమె వేధింపులకు భయపడిపోయాడు. ఇంట్లో ఉంటే ఆమె చూపించే నరకం తట్టుకోలేనని అతడికి అర్థమైపోయింది. అందుకే ఇంట్లో ఉండడం కంటే జీవితాతం జైలులో గడపడం నయం అనుకున్నాడు. ఏం చేస్తే పోలీసులు పట్టుకుంటారో అర్థంకాక.. చివరికి ఏకంగా పోలీస్​ ష్టేషన్​కే నిప్పంటించేశాడు. ఈ ఘటన గుజరాత్​లోని రాజ్​కోట్​లో జరిగింది.

Man troubled by wife set fire to police station
భార్య బాధితుడు

'చుక్కలు చూపిస్తోంది.. నన్ను అరెస్ట్​ చేయండి..'

పోలీస్​ స్టేషన్​కు నిప్పంటించి ఆ వ్యక్తి ఎక్కడకి పారిపోలేదు. 'నన్ను అరెస్ట్​ చేయండి' అంటూ.. ఠాణా ముందే నిల్చుండిపోయాడు. అందుకు తగ్గట్టుగానే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు గాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. పెళ్లి అయిన కొద్దిరోజుల నుంచే తన భార్య వేధింపులకు గురి చేయడం ప్రారంభించిందని బాధపడ్డాడు. ఆమె నుంచి విముక్తి పొందడానికి బజరంగ్​వాడిలోని స్టేషన్​కు నిప్పంటించినట్లు పేర్కొన్నాడు.

వివాహితుడు నిప్పంటించిన ఠాణా ఇదే

ఆయనో మానసిక రోగి..!

పోలీస్​ స్టేషన్​కు​ నిప్పు అంటించిన ఆ వ్యక్తి మానసిక స్థితి బాగోలేదని విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: Krishna Janmashtami: 200 మంది చిన్నారుల మధుర 'వేణుగానం'

Last Updated : Aug 30, 2021, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.