ETV Bharat / bharat

టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​! - h.s solanki

కరోనా వ్యాక్సిన్​ రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. గుజరాత్​లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఫిబ్రవరి 15న వ్యాక్సిన్ రెండో డోసు వేసుకోగా.. ఆయనకు జ్వరం వచ్చింది. పరీక్షల్లో.. వైరస్ సోకిందని తేలింది.

COVID-19 after taking 2nd dose of vaccine
టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్​
author img

By

Published : Mar 7, 2021, 7:54 AM IST

కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా గుజరాత్​లో ఓ వైద్య శాఖ అధికారికి కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. ఆయన జనవరి 16న మొదటి డోసు, ఫిబ్రవరి 15న రెండో డోసు తీసుకున్నారు. రెండోసారి టీకా వేసుకున్నప్పుడు జ్వరం వచ్చిందని, రక్త పరీక్షలు చేయించగా కొవిడ్​ పాజిటివ్​ అని తేలిందని గాంధీనగర్​ ప్రధాన వైద్యాధికారి డాక్టర్​ హెచ్​.ఎం.సోలంకి చెప్పారు. ఆయనలో స్వల్ప లక్షణాలు కనిపించగా.. ఇంట్లోనే ఏకాంతంలో ఉన్నారని తెలిపారు.

సాధారణంగా రెండు డోసులు తీసుకున్న అనంతరం శరీరంలో యాంటీబాడీల అభివృద్ధికి 45 రోజులు పడుతుందని హెచ్​.ఎం.సోలంకి చెప్పారు. టీకా తీసుకున్న తరవాత కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:ఆరో రోజు టీకా తీసుకున్న ప్రముఖులు వీరే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.