ETV Bharat / bharat

'17ఏళ్లకు పిల్లల్ని కనడం సహజమే.. మనుస్మృతి చదివితే తెలుస్తుంది'.. హైకోర్టు జడ్జి వ్యాఖ్యలు - మనుస్మృతి గుజరాత్ హైకోర్టు

Gujarat high court Manusmriti : తల్లి, పిండం ఆరోగ్యంగా ఉంటే అత్యాచార బాధితురాలి గర్భస్రావానికి అనుమతించడం కుదరదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో 17 ఏళ్లు రాక ముందే పిల్లల్ని కనేవారని, ఈ విషయం తెలియాలంటే మనుస్మృతి చదవాలని వ్యాఖ్యానించారు.

gujarat high court manusmriti
gujarat high court manusmriti
author img

By

Published : Jun 9, 2023, 9:10 AM IST

Gujarat high court Manusmriti : అత్యాచార బాధితురాలి (మైనర్) గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలంటూ దాఖలైన పిటిషన్​పై విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం, 17 ఏళ్లు రాకముందే పిల్లల్ని కనడం ఒకప్పుడు సహజమేనని జస్టిస్ సమీర్ దవే వ్యాఖ్యానించారు. అత్యాచారానికి గురైన బాలిక, కడుపులోని పిండం ఆరోగ్యంగా ఉంటే.. అబార్షన్​కు తాను అనుమతించనని తేల్చి చెప్పారు.

Samir Dave high court : అత్యాచార బాధితురాలి వయసు 16 ఏళ్ల 11 నెలలు. ఆమె ప్రస్తుతం ఏడు నెలల గర్భంతో ఉంది. గర్భం దాల్చి 24 వారాలు దాటిన నేపథ్యంలో అబార్షన్​కు కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే బాలిక తండ్రి.. గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరారు. ఈ కేసును ముందస్తు విచారణకు స్వీకరించాలని బుధవారం బాలిక తండ్రి తరఫు న్యాయవాది.. కోర్టును అభ్యర్థించారు. బాలిక వయసు తక్కువ ఉన్న నేపథ్యంలో.. ఆమె ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సమీర్ దవే.. 21వ శతాబ్దంలో ఉన్నాం కాబట్టే.. ఈ ఆందోళనంతా అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మనుస్మృతిని ప్రస్తావిస్తూ మాట్లాడారు.

"కావాలంటే మీ అమ్మను, అమ్మమ్మను అడగండి. వివాహానికి (అప్పట్లో) 14, 15 ఏళ్లే గరిష్ఠ వయసు. 17 ఏళ్లు రాకముందే బాలికలు.. తన తొలి బిడ్డకు జన్మనిచ్చేవారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందుగానే పెద్దవారు అవుతారు. మీరు మనుస్మృతి చదవలేదేమో. ఓసారి చదవండి."
-జస్టిస్ సమీర్ దవే, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి

వైద్యుల అంచనా ప్రకారం బాలిక డెలివరీ డేట్ ఆగస్టు 16 అని జస్టిస్ సమీర్ దవే పేర్కొన్నారు. బాలికకు, పిండానికి ఎలాంటి సమస్య లేకపోతే అబార్షన్ ఉత్తర్వులు జారీ చేయడం కష్టమని స్పష్టం చేశారు. చివరకు.. వైద్యపరంగా గర్భవిచ్ఛిత్తి సాధ్యమవుతుందో లేదో పరీక్షించి చెప్పాలని రాజ్​కోట్ సివిల్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్​కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. బాలిక శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉందో అంచనాకు రావాలని వైద్యులకు సూచించారు. జూన్ 15 నాటికి ఇందుకు సంబంధించిన నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. అదే రోజు తదుపరి విచారణ చేపడతామని తెలిపారు.

గర్భస్రావానికి కోర్టు అనుమతి రాకపోతే తదుపరి పరిణామాల విషయంపై దృష్టిసారించాలని బాలిక న్యాయవాదులకు సూచించారు. 'బాలిక, ఆమె కడుపులో పెరుగుతున్న పిండం ఆరోగ్యంగా ఉంటే అబార్షన్​కు నేను అనుమతించను. పిండం బరువు కూడా బాగానే ఉంది. బాలిక జన్మనిచ్చిన తర్వాత శిశువు బతికితే? ఆ చిన్నారిని ఎవరు సంరక్షిస్తారు? అలాంటి శిశువులకు ఏవైనా ప్రభుత్వ పథకాలు ఉన్నాయా అనే విషయంపై నేనూ పరిశీలన చేస్తా. శిశువును దత్తత తీసుకునేవారు ఎవరైనా ఉంటే వారిని మీరు గుర్తించండి' అని న్యాయవాదికి సూచించారు జస్టిస్ సమీర్ దవే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.