అండర్‌గ్రౌండ్ ట్యాంకును శుభ్రం చేస్తుండగా.. విషవాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు (Crime news Telugu) మరణించారు. గుజరాత్ గాంధీనగర్‌లోని (Gujarat Gandhinagar news) ఓ ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది.
శనివారం కంపెనీకి సెలవు కావడం వల్ల.. ద్రవ వ్యర్థాలను నిల్వ చేసే ట్యాంకును (Crime news Telugu) శుభ్రం చేయించేందుకు కూలీలను పిలిచారు ఫార్మా సంస్థ యజమాని. ట్యాంకులో ద్రవ వ్యర్థాలు పెద్దగా లేనందున ఓ కూలి.. లోపలికి దిగి శుభ్రం చేసేందుకు యత్నించాడు. అంతలోనే విషవాయువులు పీల్చి కుప్పకూలాడు. అతన్ని కాపాడేందుకు మిగిలిన నలుగురు ట్యాంకులోకి దిగి.. అదే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు.
కార్మికులకు ఫార్మా సంస్థ యజమాని ఎలాంటి సురక్షిత పరికరాలు అందించలేదని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే ఫార్మా కంపెనీ వద్దకు చేరుకొని కూలీలను బయటకు తీశారు. అప్పటికే వారంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల వయసు 30-35 ఏళ్ల మధ్య ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: