గుజరాత్ భావనగర్ ప్రాంతంలోని ఓ కొవిడ్ కేర్ సెంజర్లో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రోగులను స్థానిక ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు.
"టీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అది కాస్త స్వల్ప అగ్ని ప్రమాదానికి దారి తీసింది. దానిని మేము వెంటనే అదుపు చేశాము. అయితే పై అంతస్థులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ముందు జాగ్రత్తగా 61మంది రోగులను స్థానిక ఆస్పత్రులకు తరలించాము. మిగిలిన ఏడుగురిని కూడా త్వరలో తరలిస్తాం. రోగులందరూ సురక్షితంగానే ఉన్నారు."
-అధికారులు
భావనగర్‌లోని ఈ జనరేషన్ ఎక్స్ హోటల్‌ను ఓ ప్రైవేటు ఆస్పత్రి.. కొవిడ్ కేర్ సెంటర్‌గా మార్చి.. చికిత్స అందిస్తోంది.
ఇదీ చదవండి : కరోనాను దరిచేరనీయని ఆదర్శ గ్రామం