గుజరాత్ కచ్ జిల్లా బచావు పోలీస్స్టేషన్ పరిధిలోని నెర్ గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. ఆలయంలోకి ప్రవేశించారన్న కారణంతో 20 మంది దుండగులు ఓ దళిత కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయపడినట్లు సమాచారం.
మంగళవారం(అక్టోబరు 26) జరిగిన ఈ ఘటనపై స్పందించిన బచావు పోలీసులు నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటివరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని డిప్యూటీ ఎస్పీ కిషోర్ సిన్హా జాలా తెలిపారు.
దుండగులు దళిత కుటుంబం పంటపొలాన్ని ధ్వంసం చేశారని, సెల్ఫోన్లు దొంగిలించారని, అంతేగాక రిక్షాను ధ్వంసం చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది.
ఇదీ చూడండి: యువతి దారుణ హత్య.. ప్రేమ వివాహం చేసుకుందని..