ETV Bharat / bharat

మోదీ మేజిక్ రిపీట్.. గుజరాత్​లో భాజపా నయా చరిత్ర.. ఎన్ని సీట్లు వచ్చాయంటే? - గుజరాత్​లో ఎవరు గెలిచారు

కంచుకోటలో కమలం మళ్లీ వికసించింది. గుజరాత్​లో వరుసగా ఏడోసారి భాజపా విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఫలితాలను సాధించింది. మొత్తం 182 స్థానాలకు గాను.. 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది.

GUJARAT ASSEMBLY ELECTION 2022 RESULTS
GUJARAT ASSEMBLY ELECTION 2022 RESULTS
author img

By

Published : Dec 8, 2022, 1:34 PM IST

Updated : Dec 8, 2022, 6:07 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహం ఫలించింది. గుజరాత్​లో కాషాయ కంచుకోట మరింత బలపడింది. రాష్ట్రంలో భాజపాకు ఎవరూ సాటిలేరని మరోసారి రుజువైంది. సరికొత్త చరిత్ర సృష్టిస్తూ కమలం పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వరుసగా ఏడోసారి రాష్ట్రంలో జయకేతనం ఎగురవేసింది. సొంత రికార్డులను బద్దలు కొడుతూ అత్యధిక నియోజకవర్గాలను గెలుచుకుంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి 156 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్​ పార్టీ 17 స్థానాలను గెలుచుకోగా.. ఆప్ 5 చోట్ల, ఇతరులు 4 చోట్ల గెలుపొందారు.

పార్టీ పేరు గెలిచిన స్థానాల సంఖ్య
భాజపా156
కాంగ్రెస్​17
ఆమ్​ఆద్మీ05
ఇతరులు04

అన్ని ప్రాంతాల్లో
గుజరాత్​లోని అన్ని ప్రాంతాల్లో భాజపా హవా కనిపించింది. సౌరాష్ట్ర సహా ఉత్తర, దక్షిణ గుజరాత్​లో ఓటర్లు భాజపాకే జై కొట్టారు. ఆరంభంలో కచ్​లో కాస్త ప్రతికూల పవనాలు వీచినట్లు కనిపించినా.. చివరకు భాజపాదే హవా అని తేలింది. తద్వారా.. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థానాలు కైవసం చేసుకోగలిగింది.

సరికొత్త రికార్డులు
ఈ ఎన్నికల్లో భాజపా అనేక రికార్డులు కొల్లగొట్టింది. వరుసగా ఏడు ఎన్నికల్లో గెలుపొందిన రెండో పార్టీగా చరిత్ర లిఖించింది. బంగాల్​ను 1977 నుంచి 2011 వరకు పాలించిన సీపీఎం.. వరుసగా ఏడుసార్లు నెగ్గిన తొలిపార్టీ.

టార్గెట్ సాధించి..
ఎగ్జిట్ పోల్స్ అన్నీ భాజపాదే విజయం అని తేల్చి చెప్పాయి. ఈ విషయం ఫలితాల్లోనూ స్పష్టమైంది. అయితే, ఈసారి గెలవడం కంటే రికార్డు సాధించడంపైనే భాజపా దృష్టిపెట్టింది. మోదీ సైతం ఇదే వ్యూహాన్ని కమలనాథులకు నూరిపోశారు. 150 సీట్లను టార్గెట్​గా పెట్టుకొని పనిచేయాలని చెబుతూ వచ్చారు. ఆయన అనుకున్నట్టే భాజపా.. ఆ మార్క్​కు చేరువగా వచ్చింది. తద్వారా రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా రికార్డుకెక్కనుంది. 1985లో మాధవ్​సిన్హ్ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ 149 స్థానాలు గెలుచుకోవడం ఇప్పటివరకు రికార్డుగా ఉంది.

లాభించిన చీలిక..
గుజరాత్​లో ఎప్పుడూ ఇరుపార్టీల మధ్యే పోరు ఉండగా.. ఆప్ తెరంగేట్రంతో అది కాస్తా త్రిముఖ పోరుగా మారింది. దీంతో ఓట్లు మూడు పార్టీల మధ్య చీలాయి. ఇది భాజపాకే లాభం చేకూర్చింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఆప్ గండికొట్టింది. చాలా సీట్లలో ఆప్ చీల్చిన ఓట్లు ఫలితాన్ని మార్చేశాయి. దీని వల్ల భాజపా మరిన్ని సీట్లు గెలిచే ఛాన్స్ ఏర్పడింది.

గెలుపు గుర్రాలకే సీటు..
ఎన్నికలకు ముందు భాజపాలో అసంతృప్తుల సెగ చెలరేగింది. చీలిన విపక్షం కంటే కూడా స్వపక్షంలో తిరుగుబాట్లే తమకు ఎక్కువ ఇబ్బంది కల్గించే ప్రమాదం ఉందని భాజపా నేతలు ఆందోళన చెందారు. అయినప్పటికీ, గెలుపు గుర్రాలనే నమ్ముకుంది. వారికే సీట్లు ఇచ్చింది. చాలామటుకు సీట్లలో తన వారిని కాదని కాంగ్రెస్‌ నుంచి వచ్చి చేరిన అభ్యర్థులకు సీట్లిచ్చింది. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది.

తిరిగొచ్చిన పాటీదార్లు
పాటీదార్ల ఆగ్రహం ఎలాంటిదో భాజపాకు 2017లోనే తెలిసివచ్చింది. దీంతో ఈసారి ఆ వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినప్పుడు సీఎంను మార్చేసి.. పెద్దగా అనుభవం లేని పటేల్ వర్గం నేత భూపేంద్ర పటేల్​ను నియమించింది. పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్​ను పార్టీలో చేర్చుకుంది. 2019లో కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాటీదార్లకు మేలు చేస్తాయని ప్రచారం చేసుకుంది.

ద్రవ్యోల్బణంపై..
ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలపై సర్కారును ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రచారం చేశాయి. ఈ ఆరోపణలతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకొని భాజపా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ అంశాలపై భాజపా విపక్షాలకు గట్టిగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది.

2024కు బూస్ట్
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర సమయం ఉంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే తిరుగులేని పార్టీగా అధికారం చెలాయిస్తోంది భాజపా. ఈ నేపథ్యంలో గుజరాత్ ఘన విజయం.. భాజపాకు నయా జోష్ ఇచ్చింది. తమకు ఎదురు లేదని, 2024 సార్వత్రికంలో తమదే ఆధిపత్యం ఉంటుందని ప్రచారం చేసుకునే అవకాశం కమలదళానికి దక్కింది. గుజరాత్ ఫలితం భాజపా నైతికస్థైర్యానికి మరింత బలాన్ని చేకూర్చినట్లవుతుంది.

Last Updated : Dec 8, 2022, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.