యువతిని ప్రేమించాడన్న కారణంతో ఓ 20 ఏళ్ల యువకుడిని దారుణంగా కొట్టి చంపారు ఆమె కుటుంబ సభ్యులు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరా జిల్లా చొకరీ గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై యువతి తండ్రి సహా మరో ముగ్గురుపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది..
చొకరీ గ్రామానికి చెందిన జయేశ్ రావల్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కలిసి తిరగడాన్ని గమనించిన యువతి తల్లి.. కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబీకులు.. జయేశ్ రావల్పై దాడికి దిగారు. ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ క్రమంలో బాధితుడు స్పృహ కోల్పోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి : కోపంతో కోడలి చెయ్యి నరికిన మామ... అతికించిన వైద్యులు