గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అద్భుత రంగవల్లులు (Rajkot Rangoli Competition) కొలువుదీరాయి. దీపావళి పండుగను పురస్కరించుకుని అజంతా ఆర్ట్స్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో (Rangoli Rajkot) 77 మంది కళాకారులు... అబ్బురపరిచేలా ఉన్న 125 ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. వివిధ రంగాల్లోని ప్రముఖుల చిత్రాలతో రంగవల్లులు వేశారు.
దేవుళ్ల ముగ్గులు, పర్యావరణం, ఛత్రపతి శివాజీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా, సాధువు, అందమైన యువతి, ఫ్రంట్‌లైన్ వారియర్స్ చిత్రాలను రంగవల్లుల్లో అందంగా తీర్చిదిద్దారు. ఛాయచిత్రాలను తలపించేలా వేసిన ఈ ముగ్గులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ రంగవల్లులను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రముఖుల ఖ్యాతి, పర్యావరణంపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ రంగవల్లుల ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆ అవినీతి తిమింగలాలను పట్టుకొచ్చి, తిన్నది కక్కిస్తేనే..