గుజరాత్ గిర్ సోమనాథ్ జిల్లాలో అల్ప వ్యవధిలోనే 19 తేలికపాటి భూకంపాలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.7 నుంచి 3.3 మధ్య నమోదైంది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
రాత్రి 1.42 నిమిషాల నుంచి భూమి కంపించడం ప్రారంభమైందని గాంధీ నగర్లోని భూకంప పరిశోధన సంస్థ తెలిపింది. జిల్లాలోని తలాల కేంద్రంగా భూప్రకంపనలు ఏర్పడినట్లు గుర్తించింది.
'సాధారణం కంటే రెండు మూడు నెలలు అధికంగా వర్షపాతం నమోదైతే ఇలా జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఇలా జరిగింది' అని భూకంప పరిశోధన సంస్థ డైరెక్టర్ సుమేర్ చోప్రా తెలిపారు.
ఇదీ చూడండి: 'అంబానీ-అదానీ చట్టాల్ని రద్దు చేయాలి'